For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న పెరిగి, నేడు తగ్గిన బంగారం ధరలు.. రూ.6000 డౌన్: ఇంకా ఎంత తగ్గవచ్చు?

|

ముంబై: స్పాట్ బంగారం ధరలు గురువారం 2 నెలల కనిష్టానికి చేరుకున్నాయి. పసిడి పండుగ డిమాండ్‌పై అనిశ్చితులు, ప్రపంచ ఆర్థిక దృక్పథ గందరగోళం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి వివిధ కారణాల మధ్య ధరలు క్షీణించాయి. సెషన్ ముగిసే సమయానికి నిన్న స్వల్పంగా పెరిగాయి. మళ్లీ ఈ రోజు తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఈరోజు (సెప్టెంబర్ 25, శుక్రవారం) 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 0.27 శాతం క్షీణించి రూ.49,771 పలికింది. చైనా తర్వాత బంగారం వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంటుంది. నాలుగు రోజుల్లో పసిడి ధరలు రూ.2500కు పైగా తగ్గింది. కిలో వెండి ఫ్యూచర్స్ 0.5 శాతం తగ్గి రూ.59,329 పలికింది. నిన్న పసిడి రూ.300 పెరగగా, వెండి రూ.1000కి పైగా పెరిగింది. మొత్తంగా ఈ వారంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.

భారీగా తగ్గిన బంగారం ధర, ఈవారం రూ.2,500 డౌన్: ఆల్‌టైం హైతో వెండి రూ.20,000 తగ్గిందిభారీగా తగ్గిన బంగారం ధర, ఈవారం రూ.2,500 డౌన్: ఆల్‌టైం హైతో వెండి రూ.20,000 తగ్గింది

రూ.6000కు పైగా తక్కువ.. బంగారం ధర పెరగవచ్చా?

రూ.6000కు పైగా తక్కువ.. బంగారం ధర పెరగవచ్చా?

ఆగస్ట్ 7న పసిడి ధర రూ.56,200 పైకి చేరుకొని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. నెల పదిహేను రోజులుగా క్రమంగా తగ్గుతోంది. నాలుగు రోజుల్లో రూ.2500కు పైగా తగ్గిన పసిడి ధర, ఆల్ టైమ్ గరిష్ట ధరతో పోలిస్తే రూ.6000 పైగా తగ్గింది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.20వేలు, ఈ వారం రూ.9వేలు తగ్గింది. వారం అమెరికా డాలర్ బలపడటంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అమెరికా సహా వివిధ దేశాలు వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. దాదాపు సున్నాగా ఉన్నాయి. ఈ వడ్డీ రేట్లు చాలాకాలం పాటు ఉంటాయని కూడా సంకేతాలు ఇచ్చాయి. ఇది మున్ముందు బంగారంపై ఒత్తిడిని పెంచి, ధరలు పెరగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు మరింత లిక్విడిటీని పుష్ చేసేందుకు ప్రయత్నాలుచేస్తాయని, ఇది బంగారంపై సానుకూల ధోరణి అని అంటున్నారు.

ఇంకా తగ్గుతుందా.. అయితే ఎంత వరకు?

ఇంకా తగ్గుతుందా.. అయితే ఎంత వరకు?

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 1850 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ధరలు 1820 డాలర్ల వరకు కరెక్షన్ ఉండవచ్చునని, ఎంసీఎక్స్‌లో రూ.47,000 వరకు కరెక్షన్ ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారంపై పెట్టుబడికి దీర్ఘకాల ధోరణి అయితే అనుకూలం. స్వల్పకాలంలో ప్రస్తుత పరిస్థితిని బట్టి మరింతగా తగ్గే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. రూ.45వేల నుండి రూ.47వేల మధ్య కొనుగోలుకు మద్దతు లభించవచ్చునని భావిస్తున్నారు. వెండి కిలో స్టాప్ లాస్ రూ.58,700, టార్గెట్ రూ.56,000గా ఉంది. అయితే ధరల పెరుగుదల, తగ్గుదల కరోనా కేసులు, డాలర్ వ్యాల్యూ, ఆర్థిక కార్యకలాపాలు, ఈక్విటీ మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు.. తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు.. తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి తగ్గుముఖం పట్టాయి. అమెరికా డాలర్ బలపడటం ప్రధానంగా బంగారంపై ఒత్తిడిని తగ్గించింది. డాలర్ ఇండెక్స్ ఈ వారం 1.5 శాతం మేర లాభపడింది. ఏప్రిల్-మే నెలల నుండి ఇది గరిష్టం. స్పాట్ గోల్డ్ 0.2 శాతం క్షీణించి ఔన్స్ 1,864.47 డాలర్లు పలికింది. ఈ వారంలో 4 శాతం క్షీణించింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ఔన్స్ 1.1 శాతం మేర క్షీణించి 22.95 డాలర్లకు, ప్లాటినమ్ 0.3 శాతం క్షీణించి 846.72 డాలర్లకు, పల్లాడియం దాదాపు స్థిరంగా ఔన్స్ 2,226.44 వద్ద ఉంది.

English summary

నిన్న పెరిగి, నేడు తగ్గిన బంగారం ధరలు.. రూ.6000 డౌన్: ఇంకా ఎంత తగ్గవచ్చు? | Gold prices slide to two month low, How much more can prices decline?

Spot gold prices eased further on Thursday to a two-month low as doubts over the yellow metal’s festive demand continued to outweigh other factors, including an uncertain global economic outlook and rising unemployment.
Story first published: Friday, September 25, 2020, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X