రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం, అమెరికా డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణించిన నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడానికి తోడు రూపాయి ప్రభావం ఇక్కడ మరింత భారం మోపుతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు 1900 డాలర్లను తాకాయి. అంతకుముందు సెషన్‌లో 1902 డాలర్ల వద్ద ముగిసినప్పటికీ, చివరి సెషన్‌లో అతి స్వల్పంగా తగ్గాయి.
అయినప్పటికీ 1900 డాలర్లకు పైనే ఉంది. పసిడి గతవారం రూ.50,000 కాస్త అటు ఇటుగా కదలాడింది. చివరకు ఈ మార్కు క్రాస్ చేసి ముగిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఇలాగే పెరిగే అవకాశముందా అంటే?

రూ.50,000 దాటిన బంగారం
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.269 తగ్గి రూ.50,123 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.308 తగ్గి రూ.50,305 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.50,300 సమీపానికి వెళ్లింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో 1.20 డాలర్లు క్షీణించి 1900.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
నిన్నటి సెషన్‌లో పసిడి 1888 డాలర్ల నుండి 1905 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 6.31 శాతం పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.35 పెరిగి రూ.63896 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60 ఎగిసి రూ.64761 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.075 డాలర్లు లాభపడి 23.950 డాలర్ల వద్ద ముగిసింది.

ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందా?
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు కీలకమైన టార్గెట్ జోన్ 1900 డాలర్ల నుండి 1910 డాలర్లకు చేరుకుందని, కాబట్టి ఈ వారం ప్రాఫిట్ బుకింగ్ కనిపించే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం, ప్రపంచ ద్రవ్యోల్భణం వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అలాగే అమెరికా ఫెడ్ వడ్డీ రేటుపై ప్రకటన కూడా ప్రభావం చూపవచ్చు.

బంగారం ధర పడిపోయి, పెరిగే ఛాన్స్
సమీప భవిష్యత్తులో 1865 డాలర్లకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత మళ్లీ కొనుగోళ్ల మద్దతుతో మూడు నాలుగు నెలల్లో 2000 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అప్పుడు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో రూ.52,000కు చేరుకోవచ్చునని చెబుతున్నారు. బంగారం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా తర్వాత రష్యా మూడో అతిపెద్ద దేశం.
ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమిస్తే వాణిజ్యపరమైన ఆంక్షలు ఉండే అవకాశముంది. ఇప్పటికే అమెరికా, నాటో ఈ దిశగా హెచ్చరికలు జారీ చేసాయి. యుద్ధం వస్తే రష్యాపై ఆంక్షలు ఉంటాయి. అప్పుడు బంగారం ధర అనూహ్యంగా పెరిగే అవకాశముంది.

ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి
దేశీయంగా ధరలు తక్కువ ధరలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగారం రూ.50,000కు పైన ఉందని, సమీప భవిష్యత్తులో రూ.49,000 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చునని, ఆ సమయంలో కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. అయితే పసిడిపై వివిధ అంశాలు ప్రభావం చూపుతాయని గుర్తు చేస్తున్నారు. మరో మూడు నాలుగు నెలల్లో రూ.52,000 చేరే అవకాశాలు కనిపిస్తున్నందున రూ.50,000 స్థాయిలో కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించవచ్చునని అంటున్నారు. రూ.47,600 వద్ద నష్టభయంతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications