బంగారం ధరలు అంతకుముందు వారం క్షీణించినప్పటికీ, గతవారం పెరుగుదలను నమోదు చేశాయి. ఈ వారం కూడా ధరలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.51,000 దాటితే స్థిరమైన ర్యాలీ సాధించాలంటే డిసెంబర్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములు రూ.51,000 దాటాలని అంటున్నారు. అప్పుడు ధరల్లో స్థిరమైన పెరుగుదల ఉండే అవకాశముందని అంటున్నారు. లేదంటే ఈసారి ఎక్కువగా క్షీణించే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆరు నెలలుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఆ తర్వాత నుండి తగ్గుముఖం పట్టాయి. గతవారం స్వల్పంగా పెరిగాయి.

పెరిగిన పసిడి ధర
గతవారం దేశీయ ఫ్యూచర్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో పసిడి మినహా మిగతా విలువైన లోహాల ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. కమోడిటీస్‌లో ముడి చమురు ధర 4.4 శాతం మేర క్షీణించింది. కానీ రెండో అతిపెద్ద కాంపోనెంట్ పసిడి మాత్రం 2 శాతం పెరిగింది. అమెరికా అధ్యక్షులు ట్రంప్‌కు కరోనా సోకడం, డాలర్ వ్యాల్యూ స్వల్పంగా పడిపోవటం, కరోనా కేసులు పెరగడం వంటి వివిధ కారణాలతో పసిడి ధర పెరిగింది.

ఇక్కడ ధరలు పెరగవచ్చు
అయితే పండుగ సీజన్ ప్రారంభమైతే దేశీయ మార్కెట్లో ధరలు మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అంతర్జాతీయంగా గత వారం ధరలు పెరగడంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం 10 గ్రాముల పసిడి రూ.100కు పైగా తగ్గింది. మంగళవారం దాదాపు రూ.500 పెరిగింది. బుధవారం మరో రూ.200 పెరిగిన ధర మరుసటి రోజు అతి స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం అంతేస్థాయిలో పెరిగాయి. గత వారం దాదాపు రూ.800కు పైగా పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల పసిడి సోమవారం రూ.52,150 వద్ద ప్రారంభమైంది. శనివారం రూ.42,900 వద్ద ముగిసింది. ధర రూ.750కి పైగా పెరిగింది.

రిటైల్ కొనుగోళ్లు పెరిగే అవకాశం
పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. కరోనా కారణంగా ఆరేడు నెలలుగా పసిడి డిమాండ్ పడిపోయింది. ఇటీవల ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్నాయి. దీనికి తోడు పసిడి ధరలు కూడా ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5000 వరకు తగ్గాయి. దీంతో పండుగ సీజన్‌లో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కొనుగోళ్లు పెరుగుతాయని, డిమాండ్ పూర్వస్థితికి రాకపోయినప్పటికీ కాస్త ఆశాజనకంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు ఆశతో ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంతవరకు ఢమాల్ అయిందంటే.. ఏప్రిల్ 17, శుక్రవారం ధరలు ఇవే..

Akshaya Tritiya: కేవలం గోల్డ్ మాత్రమే కాదు.. ఈ వస్తువులు కొన్నా ఇంట్లోకి లక్ష్మీ వస్తుంది!

బంగారం ధర ఈ రేటుకు రాగానే కొనడం వెంటనే ఆపేయండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ వ్యూహా కర్తలు..

Gold price: బంగారం ధర ఎందుకు నెమ్మదించింది? భారీ పెరుగుదల ఉంటుందా లేక తగ్గుతుందా?

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు భారీ ర్యాలీతో ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 15, బుధవారం ధరలు ఇవే..

బంగారం కొనాలా..వెండి కొనాలా.. ఇరాన్ యుద్ధంతో ఇన్వెస్టర్లు ఆందోళన..నిపుణులు ఏమంటున్నారంటే..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంపై షాకింగ్ న్యూస్.. 10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వ కంటే ఎక్కువే..



Click it and Unblock the Notifications