దేశంలో బంగారం ధరలు రికార్డ్ దిశగా వెళ్తున్నాయి. ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600 పెరిగి రూ.48,000 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1.5 శాతం పెరిగిరూ.48,598 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం 1 శాతం పెరిగి ఔన్స్ ధర 1,750 డాలర్లు పలికింది. కరోనా వంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే పసిడి ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ వారం ఎలా ఉండవచ్చు
బంగారం ఆగస్ట్ కాంట్రాక్ట్ రూ.46,985 కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. స్వల్ప కాలానికి రూ.48,100, మధ్యకాలానికి రూ.48,890 లక్ష్యంతో లాంగ్ పొజిషన్లు కొనసాగించవచ్చునని చెబుతున్నారు. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పసిడి సానుకూలంగా కనిపిస్తోంది. అమెరికా ఫెడ్ వ్యాఖ్యల ప్రభావం ఉంటుంది. ఆర్థిక గణాంకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని, ఈక్విటీ మార్కెట్ కోసం ఇన్వెస్టర్లు వేచి చూడటం బంగారానికి కలిసి రావొచ్చునని అంటున్నారు. వెండి కూడా కిలో రూ.47,878కి కిందకి రాకుంటే లాభాల్లోకి వెళ్తుందంటున్నారు.

23 శాతం పెరిగిన ధరలు
ఈ ఏడాదిలో (2020) అంటే గత ఆరు నెలల కాలంలోనే భారత్‌లో బంగారం ధరలు 23 శాతం పెరిగాయి. అంతకుముందు ఏడాది 25 శాతం పెరిగింది. మన దేశంలో బంగార ధరలను అంతర్జాతీయ మార్కెట్, డాలర్‌తో రూపాయి మారకం విలువ వంటివి ప్రభావితం చేస్తాయి. శుక్రవారం డాలర్ మారకంతో రూపాయి 76.19 వద్ద క్లోజ్ అయింది.

అంతర్జాతీయ పరిస్థితులు
మందగమనం, కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 15 శాతం పెరిగాయి. సెంట్రల్ బ్యాంకు ఉద్ధీపనలు, ఆర్థిక ప్యాకేజీ వంటివి బంగారం డిమాండ్‌కు కారణమయ్యాయి. ఇటీవల కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూశారన్నారు.

బంగారం ధర భారీగా పెరగనుంది..
బంగారం ధరలు ఈ వారం కూడా పెరుగవచ్చునని గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ గోల్డ్‌మన్ సాక్స్ అభిప్రాయపడింది. కరెన్సీ క్షీణత భయాలు, కరోనా అనిశ్చితి వల్ల ర్యాలీ కొనసాగవచ్చునని తెలిపింది. గోల్డ్‌మన్ సాక్స్ తన 3 నెలల, 6 నెలల, 12 నెలల బంగారం ధరల అంచనాలను వరుసగా 1,600 డాలర్ల నుండి 1,800 డాలర్లకు, 1,650 డాలర్ల నుండి 1,900 డాలర్లకు, 1,800 డాలర్ల నుండి $2,000 డాలర్లకు పెంచింది. అంటే మన దేశంలోను ఆ మేరకు బంగారం ధరలు భారీగా పెరగవచ్చు.

డిస్కౌంట్ తగ్గింది..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో భారత దేశంలో రిటైలర్స్ డిస్కౌంట్‌ను అంతకుముందు వారం ఔన్స్‌కు 20 డాలర్ల నుండి 13 డాలర్లకు తగ్గిస్తున్నారట. అంతర్జాతీయంగా బంగారం ధరల కారణంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరిగాయి. అంతర్జాతీయ బిగ్గెస్ట్ గోల్డ్ ఈటీఎఫ్ సంస్థ SPDR ETFలో గురువారం నాటికి 1,136.219 టన్నులకు పెరిగింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications