Gold prices today: బంగారం భారీగా తగ్గింది, ఇప్పుడు కొనవచ్చా?
బంగారం, వెండి ధరలు నిన్న స్వల్పంగా పెరిగాయి. క్రితం సెషన్లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.65,000 దిగువన, గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,600 దిగువన ముగిశాయి. నేడు (ఏప్రిల్ 27, బుధవారం) కూడా గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్ప తగ్గుదలతోనే కదలాడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్ ధరలు రూ.75 క్షీణించి రూ.51,509 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.32 తగ్గి రూ.51,837 వద్ద ట్రేడ్ అయింది.

బంగారం తగ్గుదల
సిల్వర్ ఫ్యూచర్స్ భారీగా తగ్గాయి. నేటి ప్రారంభ సెషన్‌లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.29 క్షీణించి రూ.64,939 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.9 క్షీణించి రూ.65,680 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.4700 వరకు తక్కువగా ఉంది. ఇటీవల బంగారం రూ.53,000 క్రాస్ చేసింది. ఈ కొద్ది కాలంలోనే రూ.1500 తగ్గింది. సిల్వర్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.1500 వరకు తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో బంగారం ధరలు చాలా రోజులకు 1900 డాలర్ల దిగువకు పడిపోయాయి. కామెక్స్‌లో మరోవైపు వెండి ధరలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (జూన్ 22) ఈ వార్త రాసే సమయానికి 6 డాలర్ల మేర క్షీణించి 1898 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.041 డాలర్లు లాభపడి 23.582 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ఎలా ఉండవచ్చు
చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం, లాక్ డౌన్ విధింపు వంటి అంశానికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉంటున్నాయి. ఫెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేటు పెంపుకు సిద్ధమైంది. డాలర్ ఇండెక్స్ 102 మార్కును క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు క్షీణతతో లేదా వయోలేట్ కావొచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బంగారం మద్దతు ధర 1885 డాలర్లు, నిరోధకం 1915 డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.51,500, నిరోధకం రూ.51,900.

బంగారం కొనవచ్చా?
బంగారం ధరలు ఇటీవలి కాలంతో పోలిస్తే ప్రస్తుతం భారీగా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కొనుగోలుకు మొగ్గు చూపవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే షార్ట్ టర్మ్‌లో ఫెడ్ వడ్డీ రేటు, రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, చైనా కరోనా - లాక్ డౌన్, ద్రవ్యోల్భణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు వీటిని పరిశీలించవచ్చునని అంటున్నారు. లాంగ్ టర్మ్‌కు మాత్రం ప్రయోజనం.


Click it and Unblock the Notifications