బంగారం ధరలు ఈవారం తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు 10 గ్రాములు 1 శాతం లేదా రూ.500 క్షీణించి రూ.51,280 పలికింది. వెండి కిలో రూ.1,056 క్షీణించి రూ.67,926 పలికింది. గత నెల (ఆగస్ట్ 7)లో బంగారం రూ.56,200 పైన, వెండి కిలో రూ.79వేల వరకు చేరుకుంది. ఆ తర్వాత రష్యా వ్యాక్సీన్ రాకతో ధరలు క్షీణించాయి. అప్పటితో పోలిస్తే పసిడి ధరలు ఇప్పటికీ రూ.5000 తక్కువ, వెండి రూ.12 వేల వరకు తక్కువగా ఉంది. ఎంసీఎక్స్‌తో పాటు బులియన్ మార్కెట్లోను నగరాల్లో ధరలు తగ్గాయి.

బంగారం ధరలు మరింతగా తగ్గవచ్చు
బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. చాలామంది అసంతృప్తి వ్యక్తం చేసిన రష్యా వ్యాక్సీన్ వచ్చినప్పుడే బంగారం ధరలు పడిపోయాయని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో ఇటీవల ఆస్ట్రాజెనికా వ్యాక్సీన్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేసినప్పుడు పసిడి ధరలు తిరిగి కాస్త పుంజుకుంటాయని చాలామంది భావించారని, కానీ అది జరగలేదని గుర్తు చేస్తున్నారు. ఆస్ట్రాజెనికా ట్రయల్స్ నిలిపివేసినప్పటికీ పసిడిపై అంతగా ప్రభావం కనిపించలేదు. ఇప్పుడు తిరిగి మళ్లీ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. అలాగే, ప్రకటనలు కూడా సానుకూలంగా వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు సమీప భవిష్యత్తులో తిరిగి పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో.. ఈక్విటీ క్షీణించినా..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు ఔన్స్ 0.7 శాతం పడిపోయి 1950 డాలర్లకు తగ్గింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు నుండి మరింత ఉద్దీపన ప్రకటనలు రాలేదు. దీంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. అలాగే, కరోనా మహమ్మారి నేపథ్యంలో 300 బిలియన్ డాలర్ల సహాయం అందించే బిల్లును అమెరికా సెనేట్‌లో బిల్లును అడ్డుకున్నారు. నాస్‌డాక్ క్షీణించినప్పుడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. నాస్‌డాక్ 100 ఏడు సెషన్‌లలో శుక్రవారంతో 5 రోజులు నష్టపోయిందని, సెప్టెంబర్ 2వ తేదీ నుండి 2 శాతం తగ్గిందని మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు, భారత్‌లో ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వరద వచ్చింది. తాజాగా, ఆర్బీఐ గోల్డ్ నిల్వలు సెప్టెంబర్ 4 నాటికి 321 మిలియన్ డాలర్లు పెరిగి 37.521 బిలియన్ డాలర్లుగా ఉంది.

వివిధ నగరాల్లో ధరలు...
శనివారం హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గి రూ.53,450 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.49,000 పలికింది. వెండి కిలో రూ.600 వరకు తగ్గి రూ.68,000లోపు పలికింది. కరోనా కేసులు, కోవిడ్ 19 వ్యాక్సీన్, సరిహద్దు ఉద్రిక్తతలు, అమెరికా-చైనా ట్రేడ్ వార్, భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ వ్యాల్యూ, వడ్డీ రేట్లు వంటివి పసిడిపై ప్రభావం చూపిస్తాయి.
More From GoodReturns

నిజాం నవాబుల బంగారం.. హైదరాబాద్ వ్యాపారికి రూ. 50 కోట్లు టోపీ పెట్టిన కేటుగాళ్లు.. అసలు కథ ఏంటంటే..

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

సముద్రం అడుగున సీక్రెట్ బంగారం ఫ్యాక్టరీ.. ప్రపంచానికి తెలియని షాకింగ్ నిజం.. బట్టబయలు చేసిన సైంటిస్టులు..

బంగారాన్ని భారీగా కొంటున్న బ్యాంకులు.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులన్నీ అమ్మేసి మరీ.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: అమెరికా ఇరాన్ చర్చల తర్వాత పెరిగిన బంగారం ధరలు

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications