భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.47,800కు దిగువనే పసిడి: సిల్వర్ రూ.61,000 దిగువకు
కేంద్ర బడ్జెట్‌కు ముందు పసిడి ధరలు అప్రమత్తంగా కదులుతున్నాయి. గతవారం రూ.49,000 దిశగా పరుగెత్తిన గోల్డ్ ఫ్యూచర్ రూ.1000 వరకు తగ్గి ప్రస్తుతం రూ.47,800 దిగువన ఉన్నాయి. నేడు (సోమవారం, 31, 2022 జనవరి) దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, అమెరికా ద్రవ్యోల్భణ డేటా, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ వంటి వివిధ అంశాలు పసిడి మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ధరలు భారీగా తగ్గడంతో పాటు, డిమాండ్ వేగంగా పుంజుకునే అవకాశాలున్నాయి.

భారీగా పెరిగి, అంతే స్థాయిలో తగ్గి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.5 లాభపడి రూ.47,616 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50 పెరిగి రూ.47,635 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,700కు దిగువనే ఉంది.
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో కామెక్స్‌లో పసిడి ధరలు నేడు అతి స్వల్పంగా 1.10 శాతం లాభపడి 1786 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.ఇటీవల ఓ సమయంలో 1850 డాలర్లను తాకిన గోల్డ్ ఫ్యూచర్ ఇప్పుడు 1790 డాలర్ల దిగువకు వచ్చింది. ఈ కొద్ది సెషన్‌లలోనే ఏకంగా 60 డాలర్ల మేర క్షీణించింది.

రూ.61,000 దిగువకు సిల్వర్ ఫ్యూచర్స్
వెండి ధరలు ఏకంగా రూ.61,000 స్థాయికి వచ్చాయి. కొద్ది సెషన్‌ల క్రితం రూ.66,000కు చేరువైన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.61,000 దిగువకు వచ్చాయి. ఈ కాలంలోనే దాదాపు రూ.5000 తగ్గాయి. నేటి ప్రారంభ సెషన్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.45 క్షీణించి రూ.60,989 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.56 క్షీణించి రూ.61,720 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 0.031 డాలర్లు తగ్గి 22.332 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ధరలు పెరుగుతాయా
బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8500 తక్కువగా ఉంది. గత రెండు సెషన్‌లలో పసిడి భారీగా పడిపోయింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశముందని, పోస్ట్ ఫెడ్ మీటింగ్ అనంతరం ఈటీఎఫ్ ఇన్వెస్టర్లు మరో పెట్టుబడి మార్గంలోకి వెళ్తున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పసిడి 1800 డాలర్లకు దిగునే కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికిప్పుడు అంతగా పెరిగే అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications