భారీగా తగ్గిన బంగారం ధరలు, ఈ వారం ప్రభావం చూపే అంశాలు
బంగారం ధరలు గతవారం తగ్గుముఖం పట్టాయి. గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం దాదాపు రూ.1000 వరకు క్షీణించాయి. గతవారం ప్రారంభంలో రూ.53,500 దరిదాపుకు చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.52,300 దిగువన ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా 1990 డాలర్ల స్థాయికి చేరుకున్నప్పటికీ చివరకు 1932 డాలర్ల వద్ద ముగిసింది. దాదాపు 60 డాలర్లు క్షీణించింది. వెండి ధరలు రూ.67,000 దిగువకు పడిపోయాయి. అంతకుముందు వరుసగా రెండు వారాలు లాభాల్లో కనిపించిన బంగారం, వెండి ఈ వారం మాత్రం క్షీణించాయి.

బంగారం రూ.1000 డౌన్
జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం చివరి సెషన్‌లో రూ.149 క్షీణించి రూ.52,264 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.156 క్షీణించి రూ.52,502 వద్ద ముగిసింది. ఓ సమయంలో రూ.53,500 సమీపానికి చేరుకున్నప్పటికీ, చివరి సెషన్‌లలో తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4000 వరకు తక్కువగా ఉంది.
సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.70,000 స్థాయి నుండి రూ.66,600 దిగువకు పడిపోయింది. అంటే గత వారం రూ.3500 వరకు తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.14000 వరకు తక్కువగా ఉంది. మే సిల్వర్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.537 తగ్గి రూ.66,588 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.525 క్షీణించి రూ.67,388 వద్ద ముగిసింది.

2000 డాలర్ల దిశగా పరుగు పెట్టి
అంతర్జాతీయ మార్కెట్‌లోను 2000 డాలర్ల దిశగా పరుగు పెట్టిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.1930 డాలర్లకు పడిపోయింది. గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో 15.70 డాలర్లు తగ్గి 1932 డాలర్లకు పడిపోయింది. ఓ సమయంలో 2000 డాలర్ల దిశగా కనిపించింది. కానీ అంతలోనే పడిపోయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైన ప్రారంభమై, గతవారం చివరకు 24.190 డాలర్ల వద్ద ముగిసింది. అంటే దాదాపు 2 డాలర్లు క్షీణించింది.

బంగారంపై ప్రభావం
సాధారణంగా లాంగ్ టర్మ్‌లో బంగారంపై పెట్టుబడి సరైన నిర్ణయంగానే చెప్పవచ్చు. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసి, పెడితే ఆ తర్వాత మంచి రిటర్న్స్ ఉంటాయి. అయితే షార్ట్ టర్మ్ కోసం మాత్రం పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌ను చూస్తే డాలర్ ఇండెక్స్, అమెరికా జీడీపీ డేటా, ద్రవ్యోల్భణం వంటి అంశాలను గమనించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రెంచ్ ప్రెసిడెన్షియల్స్ ఎన్నికలు, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, డొమెస్టిక్ మార్కెట్‌లో డిమాండ్ వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications