ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయంగా పసిడి ధరలు ఇటీవల ఊగిసలాటలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం, డాలర్ మారకం వ్యాల్యూ, ఆర్థిక రికవరీ వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపుతున్నాయి. గతవారం చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ అంశం వెలుగుచూసినప్పుడు ఆర్థిక సంక్షోభం భయాలతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. ఈ అంశం చల్లబడిన తర్వాత బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గతవారం బంగారం ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) రూ.46,000కు దిగువన ప్రారంభమై, ఆ తర్వాత పెరిగినప్పటికీ, చివరలో మళ్లీ తగ్గి, అదే స్థాయిలో ముగిశాయి. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగినప్పటికీ, నేడు (సెప్టెంబర్ 28, మంగళవారం) ప్రారంభ సెషన్‌లో క్షీణించాయి.

ఆ మార్కు దిగువకు బంగారం
ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.78.00 (-0.17%) క్షీణించి రూ.45991.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.59.00 (-0.13%) తగ్గి రూ.46100.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.147.00 (-0.24%) క్షీణించి రూ.60487.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.171.00 (-0.28%) తగ్గి రూ.61041.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.25 (-0.13%) క్షీణించి 1,749.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.072 (-0.32%) తగ్గి 22.622 వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం రూ.46,000 దిగువకు పడిపోగా, అంతర్జాతీయ మార్కెట్లో 1750 డాలర్ల కిందకు వచ్చింది.

ఇన్వెస్టర్ల వేచిచూసే ధోరణి
డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరగడానికి తోడు సెంట్రల్ బ్యాంకు మానిటరీ పాలసీకి సంబంధించి పెడరల్ రిజర్వ్ అధికారుల సూచనల కోసం ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ వారం కూడా పసిడి ధరలు పడిపోవచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర నేడు 0.1 శాతం క్షీణించి 1,748.01 డాలర్ల వద్ద పలికింది. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం పెరిగింది. టెన్ ఇయర్ యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ అధికారులు సోమవారం ఫెడ్ నెలవారీ బాండ్స్ కొనుగోళ్లను తగ్గించారు. ప్లాటినమ్ ధర 0.5 శాతం క్షీణించి 976.07 డాలర్ల వద్ద, పల్లాడియం 0.6% క్షీణించి 1,952.44 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మద్దతు ధర...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ మద్దతు ధర 1740-1728 డాలర్లు. నిరోధకస్థాయి 1764-1778 డాలర్లు. సిల్వర్ నిరోధకస్థాయి 22.88-23.20 డాలర్లు. మద్దతు ధర 22.55-22.20 డాలర్లు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.45900-రూ.45660. నిరోధకస్థాయి రూ.46300-రూ.46550. సిల్వర్ మద్దతు ధర రూ.60100-రూ.59800. నిరోదకస్థాయి రూ.61100-రూ.61600. బంగారం రూ.45720 స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.46300 టార్గెట్ ధరతో రూ.45900 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ప్రస్తుతం బంగారం పైకీ, కిందకు కదులుతోంది. ప్రస్తుతం పసిడి ధరలు తగ్గుతున్నాయి. మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారంలో ఇన్వెస్ట్ చేసేముందు బులియన్ మార్కెట్‌పైన పూర్తిగా అవగాహన పెంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!



Click it and Unblock the Notifications