పసిడి ధరలు గత సెషన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో రూ.250కి పైగా తగ్గాయి. రూపాయి బలపడటంతో అంతకుముందు సెషన్‍లో రూ.52,407 పలికిన పసిడి నిన్నటి సెషన్‌లో 10 గ్రాములు రూ.52,155కు తగ్గింది. ఇక, ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.07 శాతం పెరిగి 10 గ్రాములు రూ.51,450 పలికింది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.65,980 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్ 1,949 డాలర్లు, ఔన్స్ వెండి 27.33 డాలర్లు పలికింది.

రిటైల్ కొనుగోలుదారులకు ఇదే ఛాన్స్!
ఈ నెల ప్రారంభంలో బంగారం ధరలు రూ.59వేలకు చేరువై, రూ.60,000 సమీపిస్తుందని భావించిన సమయంలో రష్యా వ్యాక్సీన్ రాక అతి ఖరీదైన లోహంపై ఒత్తిడిని తగ్గించింది. దీంతో రూ.60వేల దిశగా వెళ్లే పసిడి యూటర్న్ తీసుకుంది. ఇప్పుడు ఆయా నగరాల్లో రూ.53 వేల నుండి రూ.54 వేలకు కాస్త అటు ఇటుగా ఉంది. ధరలు ఐదువేల రూపాయల కంటే ఎక్కువే తగ్గాయి. రెండువారాల క్రితమే దాదాపు ఈ ధరకు వచ్చింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, అదే స్థాయిలో పెరుగుతూ దాదాపు అక్కడే అస్థిరంగా కొనసాగుతోంది. దీంతో రిటైల్ కొనుగోలుదారులకు ఇది ఒక అవకాశమని చెబుతున్నారు.

పెరగవచ్చు... తగ్గవచ్చు
సమీప భవిష్యత్తులో అవసరం పడిన రిటైల్ పసిడి కొనుగోలుదారులు ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు! కరోనా, వ్యాక్సీన్ పరిస్థితులకి అనుగుణంగా రూ.50వేలకు తగ్గవచ్చు. అలాగే మళ్లీ పెరిగే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. కరోనాకు సరైన వ్యాక్సీన్ వస్తే రూ.50వేల దిగువకు వస్తుందంటున్నారు. వ్యాక్సీన్ మరింత ఆలస్యమైనా, కరోనా కేసులు పెరిగినా సమీప భవిష్యత్తులో తిరిగి పెరుగుతుందని, తగ్గడం మాత్రం తక్కువే అంటున్నారు.

కన్స్యూమర్ స్పెడింగ్స్ సహా ప్రభావం
అమెరికా కామర్స్ డిపార్టుమెంట్ ప్రకారం కన్స్యూమర్ స్పెండింగ్ గత నెలలో 1.9 శాతం మేర పెరిగింది. జూలై నెల వరకు వరుసగా పెరుగుతూ వచ్చింది. అయితే అంతకుముందు రెండు నెలల కంటే స్వల్పంగా క్షీణతను నమోదు చేసింది. శుక్రవారం నాటి కామర్స్ డిపార్టుమెంట్ డేటా ప్రకారం జూలైలో ఆదాయం 0.4 శాతం పెరిగింది. అంతకుముందు రెండు నెలలు క్షీణించింది. దీంతో పాటు కరోనా కేసులు, వ్యాక్సీన్, ట్రేడ్ వార్, భౌగోళిక పరిస్థితులు వంటివి పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications