బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అమెరికాలో పెరిగిన ఉద్యోగిత రేటు, డాలర్ వంటి వివిధ కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పైన ప్రభావం పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. శుక్రవారం దేశీయ ఎంసీఎక్స్‍లో 10 గ్రాముల పసిడి ఫ్యూచర్స్ ధర తగ్గి రూ.50,690 వద్ద నిలిచింది. వరుసగా మూడో రోజు ధరలు క్షీణించాయి. ఆగస్ట్ 7వ తేదీ రూ.56,200 గరిష్ట ధరతో రూ.5,500కు పైన తక్కువగా ఉంది. నెల రోజుల్లో పసిడి ధరలు పది శాతం తగ్గాయి.

2000 డాలర్లకు మళ్లీ వెళ్తుందా
పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లోను ఫ్లాట్‌గా ముగిశాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఔన్స్ ధర 1,940 వద్ద ముగిసింది. ఆగస్ట్ నెలలో 1.371 మిలియన్ల ఉద్యోగాలు పెరిగినట్లు అమెరికా డేటా వెల్లడించింది. దీంతో నిరుద్యోగిత డేటా 8.4 శాతానికి తగ్గింది. దీనికి తోడు కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ బలపడింది. మిగతా కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ పెరిగితే ఆ బాస్కెట్‍లోని కరెన్సీల్లో పసిడి ధర పెరుగుతుంది. పసిడి ధరలు గత వారం ప్రారంభంలో ర్యాలీ దిశగా కనిపించాయి, ఆ తర్వాత క్షీణించాయి. అయితే ఇప్పటికీ పసిడి ధర ఔన్స్ 2000 డాలర్ల దిశగా సాగే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

కేంద్ర బ్యాంకుల నిర్ణయం
బంగారం 2000 డాలర్ల ధరను దాటితే ఆ తర్వాత 2100 దిశగా వెళ్లడమే తరువాయి అంటున్నారు. అయితే కరోనా కేసులు, వ్యాక్సీన్ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ధర 1800 డాలర్లు చేరుకోవడం కాస్త క్లిష్టమేనని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు బంగారం పోర్ట్‌పోలియోను మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి. దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ప్రస్తుత సమయంలో ఇలాంటి తగ్గుదల నమోదయినప్పుడు కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.

ధరలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు హైదరాబాద్, విజయవాడల్లో స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పసిడి రూ.100 వరకు పెరిగింది. 10 గ్రాముల పసిడి రూ.53,310 పలకగా, 22 క్యారెట్ల పసిడి రూ.48,880 పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.54,100కు పైన పలకగా, 22 క్యారెట్ల పసిడి రూ.49,600 పలికింది.


Click it and Unblock the Notifications