మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర: మద్దతు ధర ఎక్కడంటే? రూ.50,000 పైనే పసిడి

ముంబై: బంగారం, వెండి ధరలు గురువారం (నవంబర్ 11) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగాయి. ఈ వారం బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. వ్యాక్సీన్ ప్రకటన తర్వాత భారీగా పడిపోయిన ధరలు, ఆ తర్వాత మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి. జోబిడెన్ గెలుపు, వ్యాక్సీన్ ప్రకటన తర్వాత రూ.50వేల దిగువకు పడిపోయిన పసిడి ధరలు, మళ్లీ రూ.50వేల మార్క్‌ను దాటాయి.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో నేడు ఉదయం గం.10 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.141.00 (0.28%) పెరిగి రూ.50,310 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,315.00 వద్ద ప్రారంభం కాగా, రూ.50,347.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,264.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న రూ.300 పెరిగి, నేడు రూ.140 డౌన్

నిన్న రూ.300 పెరిగి, నేడు రూ.140 డౌన్

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.140 వరకు పెరగగా, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.193.00 (0.38%) ఎగిసి రూ.50,430 పలికింది. రూ.50,455.00 వద్ద ప్రారంభమై, రూ.50,455.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,362.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.310.00 (-0.61%) క్షీణించి రూ.50,191.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.331.00 (-0.65%) తగ్గి రూ.50,246.00 వద్ద ముగిసింది. వెండి ధర కూడా నిన్న క్షీణించింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.602.00 (-0.95%) తగ్గి రూ.62,442.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.499.00 (-0.77%) క్షీణించి రూ.64,200.00 వద్ద ముగిసింది.

సిల్వర్ ఫ్యూచర్స్..

సిల్వర్ ఫ్యూచర్స్..

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.51.00 (0.08%) పెరిగి రూ.62,490.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,767.00 ప్రారంభమై, రూ.62,827.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,471.00 కనిష్టాన్ని తాకింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.32.00 (-0.05%) క్షీణించి రూ.64,200.00 పలికింది.

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి మద్దతు ధర రూ.50,000-49,800, నిరోధకస్థాయి రూ.51,380-51,550. వెండి మద్దతు ధర రూ.61,800-61,200. నిరోధకస్థాయి రూ.63,100-63,800.

అక్కడా జంప్

అక్కడా జంప్

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.32 శాతం పెరిగి ఔన్స్ ధర 1,867.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,860.75 - 1,870.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,861.60 వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి 25.63 శాతం పెరిగింది.

వెండి ఫ్యూచర్స్ 0.17 శాతం పెరిగి ఔన్స్ ధర 24.302 డాలర్లు పలికింది. 24.183 - 24.413 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 43.02 శాతం పెరిగింది. క్రితం సెషన్‌లో 24.267 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+