బంగారం ధరలు ఈ వారం వరుసగా పెరుగుతున్నాయి. అయితే ప్రతిరోజు కొంత మాత్రమే పెరుగుతున్నాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.47,500 వద్ద ముగిసింది. నేడు (అక్టోబర్ 21, గురువారం) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.61.00 (0.13%) పెరిగి రూ.47,560 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.31.00 (0.07%) లాభపడి రూ.47693.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1800 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. నిన్న 1784 డాలర్ల వద్ద క్లోజ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం సెషన్‌లో 1.30 (0.07%) డాలర్లు లాభపడి 1,786.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,781.85 డాలర్ల నుండి 1,790.10 డాలర్ల మధ్య కదలాడింది. గోల్డ్ ఫ్యూచర్స్ 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఏడాదిలో 7.88 శాతం తగ్గింది.

డాలర్ వ్యాల్యూ క్షీణించడంతో..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం 1759 డాలర్ల నుండి 1788 డాలర్ల మధ్య కదలాడాయి. నిన్న డాలర్ వ్యాల్యూ క్షీణించడంతో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో 1790 డాలర్లకు సమీపించిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ఈ వారం సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ బుధవారం మూడు వారాల కనిష్టానికి పడిపోయింది. ఇది రెండు ఖరీదైన మెటల్స్ ధరలు పెరగడానికి దోహదపడింది. యూరోజోన్ కన్స్యూమర్ ఇన్‌ఫ్లుయేషన్ సెప్టెంబర్ నెలలో పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం ఇంధన ధరలు భారీగా పెరగడమే కారణమని నిపుణులు అంటున్నారు.
డాలర్ క్షీణత దీనికి తోడు గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్ ఆందోళనలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు దోహదపడినట్లు చెప్పారు. అమెరికా నిరుద్యోగ క్లెయిమ్ డేటా విడుదల కానున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కాస్త అస్థిరంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎప్పుడు కొనుగోలు చేయాలి
ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 1800 డాలర్ల వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,250 నుండి రూ47,050. నిరోధకస్థాయి రూ.47,660 నుండి రూ.47,900. ఇక వెండి మద్దతు ధర రూ.65,200 నుండి రూ.64,700. నిరోధకస్థాయి రూ.66,100 నుండి రూ.66,670. బంగారాన్ని రూ.47,180 స్టాప్‌లాస్ పెట్టుకొని, రూ.47,775 టార్గెట్‌తో రూ.47,500 దిగువన కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

ఫ్యూచర్ మార్కెట్లో వెండి ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో వెండి రూ.65,000 దాటి రూ.66,000 దిశగా పరుగు పెడుతోంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.212.00 (0.32%) లాభపడి రూ.65819.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.239.00 (0.36%) ఎగిసి రూ.66415.00 వద్ద ట్రేడ్ అయింది. వెండి కొద్ది రోజుల క్రితమే రూ.60,000 దిగువన ట్రేడ్ అయింది. గతవారం రూ.61,000 దాటింది. నిన్న ఏకంగా రూ.65,500 పైన క్లోజ్ అయింది. నేడు రూ.66000 దిశగా సాగుతోంది. అంతర్జాతీయ
మార్కెట్లో కూడా బంగారం 24 డాలర్ల పైకి చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న 24.445 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 4.11 శాతం క్షీణించింది. నేడు దాదాపు స్థిరంగా.. అదే స్థాయిలో ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications