కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో ఓ వైపు స్టాక్ మార్కెట్లు నష్టపోతుండగా, సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇది కూడా స్వల్పమే. గత మూడు నాలుగు సెషన్లుగా గోల్డ్ ఫ్యూచర్స్ ముందుకు కదులుతున్నాయి. కొద్ది సెషన్ల క్రితం ఓ సమయంలో రూ.50,000 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ.47,500 దిగువకు పడిపోయాయి. ఒమిక్రాన్ దెబ్బతో మళ్లీ రూ.47,700 పైకి చేరుకున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధర ఇప్పటికీ 1800 డాలర్లకు దిగువన, దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.48,000కు దిగువనే ఉన్నాయి.

బంగారం పెరుగుదల కానీ
ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.150.00 (0.32%) లాభపడి రూ.47735.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ..218.00 (0.45%) ఎగిసి రూ.48178.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 9 డాలర్ల మేర పెరిగి 1797 డాలర్లకు చేరుకుంది. గతవారం 1784 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
ఈ కనిష్టంతో పోలిస్తే స్వల్పంగా మాత్రమే పెరిగింది. అంతకుముందు 1900 డాలర్ల దిశగా కనిపించింది. ఆ తర్వాత దాదాపు వంద డాలర్ల మేర క్షీణించింది. క్రితం సెషన్లో 1788 డాలర్ల వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ 48,000కు దిగువనే ఉంది. బంగారం పెరుగుతున్నప్పటికీ మందగమనంగా ఉంది.

సిల్వర్ ఫ్యూచర్స్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ధరలు భారీగా పెరిగి 63,000 డాలర్ల దిశగా వెళ్తున్నాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.720.00 (1.16%) పెరిగి రూ.62765.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.682.00 (1.08%) ఎగిసి రూ.63647.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు 0.525 డాలర్లు పెరిగి 23.660 డాలర్ల వద్ద ట్రేడ్ అయంది.

ఎక్కడ కొనుగోలు చేయవచ్చు
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో ఈ వారం ప్రారంభం బంగారం ధరలు కాస్త పెరగవచ్చునని, అయితే ఈ మహమ్మారి ప్రభావం తక్కువ అని గుర్తిస్తే మాత్రం పసిడి ధరలు క్షీణిస్తాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
బంగారం మద్దతు ధర 1780 డాలర్ల నుండి 1760 డాలర్లు. నిరోధకస్థాయి 1800 డాలర్ల నుండి 1825 డాలర్లు. సిల్వర్ మద్దతు ధర 23 డాలర్ల నుండి 22.50 డాలర్లు. నిరోధకస్థాయి 23.50 డాలర్ల నుండి 24 డాలర్లు.
ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.47720-47500. నిరోధకస్థాయి రూ.48280-48600. సిల్వర్ మద్దతు ధర రూ.62,500-62,000. నిరోధకస్థాయి రూ.63,500-64,100.
బంగారంను రూ.48,400 టార్గెట్ ధరతో, రూ.47,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.47,800 వద్ద కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications