బంగారం ధరలు ఎలా ఉన్నాయి? రూ.47,000 వద్ద కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.47,500 వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఈ నాలుగు సెషన్‌లలో దాదాపు రూ.400 వరకు తగ్గింది. వరుస సెషన్‌లలో బంగారం క్షీణిస్తోంది. నేడు (గురువారం సెప్టెంబర్ 2) గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గింది. ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9.00 (-0.02%) తగ్గి రూ.47,059 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.3.00 (-0.01%) తగ్గి రూ.47213.00 వద్ద ట్రేడ్ అయింది. ఈ వారం ప్రారంభంలో రూ.63,000 దిగువన ట్రేడ్ అయిన పసిడి ఈ నాలుగు సెషన్‌లలో రూ.500కు పైగా పెరిగింది. నేడు సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60 పెరిగి రూ.63,633 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.30 తగ్గి రూ.63,810 వద్ద ట్రేడ్ అయింది.

1800 డాలర్ల పైనే బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తోన్నప్పటికీ 1800 డాలర్లకు పైనే ట్రేడ్ అవుతోంది. నేడు 3.20 (-0.18%) డాలర్లు క్షీణించి 1,812.80 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో ఈ వారం ప్రారంభంలో 23 డాలర్ల దిగువన ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల పైకి ఎగిసింది. నేడు -0.053 (-0.22%) డాలర్లు ఎగబాకి 24.168 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత కొద్ది రోజులుగా బంగారం ఒత్తిడిలో ఉంది. ఈ ఏడేదా చివరలో అమెరికా కేంద్ర బ్యాంకు తన అసెట్ పర్చేజ్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు అమెరికా ఫెడ్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పోవెల్ సంకేతాలిచ్చారు. ఈ ఏడాదిలో నెలవారీ బాండ్స్ కొనుగోలులో కోతలను ప్రారంభించవచ్చునని సంకేతాలిచ్చినప్పటికీ, సరైన గడువు తేదీ ప్రకటించకపోవడంతో సెప్టెంబర్ నెలలో జరిగే పరపతి విధాన సమావేశంలో స్పష్టత కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తుండవచ్చు. ఈ ప్రభావం పసిడి ధరల పైన కనిపిస్తోంది.

అమెరికా పేరోల్స్ ప్రభావం
అమెరికా నాన్-ఫామ్ పేరోల్స్ డేటా విడుదలకు ముందు ఇటీవల బంగారం ధరలు స్థిరంగా లేదా స్వల్పంగా క్షీణిస్తున్నాయి. ప్రయివేటు రోల్స్ నివేదిక అంచనాలు మిస్ అవుతున్నప్పటికీ, ఈ నాన్-ఫామ్ పేరోల్స్ డేటా ఫెడ్ రిజర్వ్ ట్యాపరింగ్ ప్లాన్‌కు చాలా కీలకమైనది. ప్రస్తుతం బంగారం ధరలు 1800 డాలర్లకు కాస్త పైన ఉన్నాయి. అమెరికా జాబ్ రిపోర్ట్ నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్ 1800 డాలర్ల పైన ఉంది. అమెరికా జాబ్ నివేదిక అనంతరం బంగారం 1844 డాలర్ల వద్ద పరీక్షను ఎదుర్కోనుందని భావిస్తున్నారు. బంగారం ధరలు (ట్రాయ్ ఔన్స్) 1804 డాలర్ల నుండి 1792 డాలర్ల మధ్య మద్దతు, 1830 డాలర్ల నుండి 1844 డాలర్ల మధ్య నిరోధకస్థాయి, వెండి మద్దతు ధర 24.00 డాలర్ల నుండి 23.70 డాలర్ల మధ్య, నిరోధకస్థాయి 24.55 డాలర్ల నుండి 24.80 డాలర్ల మధ్య ఉంది.

ఎంసీఎక్స్‌లో..
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.46920-46770, నిరోధకస్థాయి రూ.47250-47480, వెండి మద్దతు ధర రూ.63500-63100, నిరోధకస్థాయి రూ.64100-64600. బంగారాన్ని రూ.44770 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.47,440 టార్గెట్‌తో రూ.47,000 వద్ద కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications