బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే గుడ్‌న్యూస్! ధరలు దిగి వస్తున్నాయి. నిన్నటి వరకు రూ.48,000కు పైన ఉన్న గోల్డ్ ఫ్యూచర్ కొద్ది వారాల తర్వాత మొదటిసారి ఈ మార్కు దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1810 డాలర్ల కిందకు వచ్చింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం రూ.62,000కు పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను 23 డాలర్లకు పైన ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ కాస్త పుంజుకోవడం పసిడిపై ప్రభావం పడింది. అలాగే ఒమిక్రాన్ ఆందోళనలు కాస్త సన్నగిల్లాయి. దీంతో కొద్ది సెషన్ల క్రితం 1820 డాలర్లకు పైన ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1800 డాలర్ల దిశగా పడిపోతోంది.

రూ.48,000 దిగువకు పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.95.00 ఎగిసి రూ.47,947 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.81 క్షీణించి రూ.48,040 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో నేడు 1804 డాలర్ల నుండి 1807 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర దాదాపు 5 శాతం మేర క్షీణించింది.
బంగారం ధరలు నిన్న (బుధవారం) దాదాపు స్థిరంగా ముగిశాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.23 క్షీణించి రూ.48,043 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.18 తగ్గి రూ.48,113 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో 1810 డాలర్ల వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.204 పెరిగి రూ.62,505 వద్ద ముగిసింది.

23 డాలర్లకు పైనే వెండి
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.94.00 నష్టపోయి రూ.62420.00 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.83 క్షీణించి రూ.63,090 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో 0.023 శాతం ఎగిసి 23.098 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ఏడాదిలో 13.81 శాతం మేర క్షీణించింది. నేటి సెషన్‌లో 22.992 డాలర్ల నుండి 23.098 డాలర్ల మధ్య కదలాడింది.

మద్దతు ధర.. నిరోధకస్థాయి
ఒమిక్రాన్ నేపథ్యంలో అమెరికాలో 11,000 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు అమెరికా అన్-ఎంప్లాయిమెంట్ డేటా వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1800 డాలర్ల నుండి 1788 డాలర్లు. నిరోధకస్థాయి 1820 డాలర్ల నుండి 1832 డాలర్లు. వెండి మద్దతు ధర 22.88 డాలర్ల నుండి 22.70 డాలర్లు. నిరోధకస్థాయి 23.34 డాలర్ల నుండి 23.55 డాలర్లు.
ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,900 నుండి రూ.47,750. నిరోధకస్థాయి రూ.48,200 నుండి రూ.48,380. వెండి మద్దతు ధర రూ.62,200 నుండి రూ.61,800. నిరోధకస్థాయి రూ.62,900 నుండి రూ.63,300.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications