గతవారం రూ.47,000 క్రాస్ చేసిన బంగారం ధరలు నేడు (అక్టోబర్ 18, సోమవారం) మరింత పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ప్రారంభ సెషన్‌లో రూ.88.00 లేదా 0.19 శాతం లాభపడి రూ.47301.00 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.41.00 (0.09%) లాభపడి రూ.47400.00 వద్ద ట్రేడ్ అయింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ (డిసెంబర్) రూ.239.00 (0.38%) లాభపడి రూ.63510.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.320.00 (0.50%) ఎగిసి రూ.64077.00 వద్ద ట్రేడ్ అయింది.
బంగారం ధరలు గతవారం రూ.48,000 దిశగా కనిపించాయి. చివరకు రూ.47,500 దిగువన ముగిశాయి. సిల్వర్ ఫ్యూచర్స్ గతవారం రూ.63,000 పైన క్లోజ్ అయింది.ఇక అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మళ్లీ పెరిగింది. ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 3.65 (-0.21%) డాలర్లు లాభపడి 1,764.65 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.037 (-0.16%) డాలర్లు క్షీణించి 23.312 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

ఏడాదిలో 8 శాతం డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8900 తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను ఆల్ టైమ్ గరిష్టం 2072 డాలర్లతో పోలిస్తే 300 డాలర్లకు పైగా తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ కనిపించడంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. గతవారం ఓ సమయంలో 1800 డాలర్లను సమీపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత 30 డాలర్ల మేర తగ్గింది.
అయితే నేడు 3 శాతం ఎగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు. నేటి సెషన్‌ల గోల్డ్ ఫ్యూచర్స్ 1,765.45 - 1,772.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాది కాలంలో బంగారం ధర 8.19 శాతం మేర క్షీణించింది. గత నెలలో బంగారం సేల్స్ 0.7 శాతం పెరిగాయి.

మద్దతు ధర, నిరోధకస్థాయి
అంతర్జాతీయంగా బంగారం ధరలు నేటి ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా లాభపడ్డాయి. అయితే డాలర్, టెన్ ఇయర్ బెంచ్‌మార్క్ స్వల్పంగా బలంగా ఉండటంతో బంగారం ధరలు కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా LBMA బంగారం నిరోధకస్థాయి 1790 డాలర్లు, 1810 డాలర్లు.
మద్దతు ధర 1760 డాలర్లు, 1750 డాలర్ల వద్ద ఉండవచ్చునని అంచనా. డొమెస్టిక్ బంగారం ధరలు ఈ గురువారం నుండి కాస్త బలహీనంగా మారే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. సాంకేతికంగా ఎంసీఎక్స్‌లో గోల్డ్ డిసెంబర్ నిరోధకస్థాయి రూ.47,550, రూ.47,750. మద్దతు స్థాయి రూ.47,000, రూ.46,850.

టార్గెట్ ధర
అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సోమవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. సిల్వర్ 24.70 డాలర్ల నుండి 22.45 డాలర్ల మధ్య ట్రేడ్ కావొచ్చునని చెబుతున్నారు. సాంకేతికంగా ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్ డిసెంబర్ రూ.61,200 నుండి రూ.64,000 మధ్య ట్రేడ్ కావొచ్చునని అంచనా. బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని, లేదా స్వల్ప మార్పులు ఉండవచ్చునని చెబుతున్నారు. గోల్డ్ బై-జోన్ రూ.47,250. టార్గెట్ ధర రూ.47,500. సెల్ జోన్ రూ.47,000. టార్గెట్ ధర రూ.46,750.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!



Click it and Unblock the Notifications