Gold Price Today: బంగారం ధరలు తగ్గాయి కానీ.. కొనుగోలు చేయవచ్చా?

బంగారం ఫ్యూచర్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 6) స్వల్పంగా తగ్గాయి. గతవారం దాదాపు స్థిరంగా ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,500 దిగువకు వచ్చాయి. నేడు ప్రారంభ సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.84.00 (-0.18%) క్షీణించి రూ.47440.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47.00 (-0.10%) క్షీణించి రూ.47590.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,433.00 వద్ద ప్రారంభమై, రూ.47,453.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,420.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరుగుతూనే ఉంది. గతవారం ప్రారంభంలో రూ.62,000 స్థాయిలో ఉన్న డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం రోజుల్లో రూ.3,000కు పైగా పెరిగి రూ.65,000ను దాటింది. నేడు ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.120.00 (0.18%) లాభపడి రూ.65329.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.140.00 (0.21%) ఎగిసి రూ.66134.00 వద్ద ట్రేడ్ అయింది.

1800 డాలర్ల పైనే పసిడి

1800 డాలర్ల పైనే పసిడి

ఇక అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా క్షీణించినప్పటికీ 1825 డాలర్లకు పైనే ఉంది. వెండి ఫ్యూచర్స్ 25 డాలర్ల దిశగా పరుగులు పెడుతోంది. గతవారం ప్రారంభంలో 22 డాలర్ల స్థాయిలో ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ ఈ కాలంలో 3 డాలర్ల వరకు పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో 5.05 (-0.28%) డాలర్లు క్షీణించి 1,828.65 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.050 (+0.20%) లాభపడి 24.852 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు పడిపోయి, చివరి సెషన్‌లలో 1830 డాలర్లకు చేరుకుంది.

గోల్డ్ ఫ్యూచర్స్ ఎలా ఉండవచ్చు?

గోల్డ్ ఫ్యూచర్స్ ఎలా ఉండవచ్చు?

గోల్డ్ ఫ్యూచర్ అక్టోబర్ ఈ వారం రూ.47,135 దిగువకు వస్తే మరింత క్షీణించి రూ.47,000 కిందకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 47,135కి పైనే ఉంటే కనుక ఆ తర్వాత రూ.47,797, అక్కడ స్థిరంగా కొనసాగితే ఆ తర్వాత రూ.48,000 దిశగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎక్స్ బుల్ డెక్స్ సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఈవారం రూ.14,142 దిగువకు రాకుంటే 14,372 క్రాస్ చేయవచ్చునని అంటున్నారు. ఇక వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.66,2200 పైకి ఎగువన కదలాడితే రూ.66,775కు, ఆ తర్వాత రూ.68,130 పైకి చేరుకోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

జాబ్ డేటా

జాబ్ డేటా

ఇటీవల విడుదలైన అమెరికా జాబ్ డేటా అంచనాలు మిస్ అయ్యాయి. జాబ్ డేటా కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ గత కొద్ది నెలలతో పోలిస్తే తగ్గింది. అమెరికాలోను కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్ట్ నెలలో కొత్తగా 2,35,000 ఉద్యోగాలు వచ్చినట్లు యూఎస్ లేబర్ డిపార్టుమెంట్ జాబ్ డేటా వెల్డిస్తోంది. ఈ ప్రభావం బంగారం పైన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ఈ వారం మరింత పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ స్టాప్ లాస్ రూ.47,386 పెట్టుకొని, రూ.47,750 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+