For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

|

బంగారం ధరలు గతవారం భారీగా పెరిగాయి. వరుసగా రెండు రోజుల పాటు భారీగా పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో మాత్రం స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ నమోదు చేసింది. దీంతో ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. చివరి సెషన్లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.43 తగ్గి రూ.48,603 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.87 క్షీణించి రూ.48,678 వద్ద ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.49,000 సమీపానికి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత రూ.48,600 స్థాయికి వచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1800 డాలర్లు దాటి మరింత ముందుకు సాగినట్లుగా కనిపించింది. అయితే చివరలో మాత్రం 1798 డాలర్ల వద్ద ముగిసింది. 1800 డాలర్ల దిగువకు రావడం కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే అంశం. 52 వారాల్లో బంగారం 1680 డాలర్ల నుండి 1980 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 5.5 శాతం పెరిగింది.

Gold price today: Yellow metal logs ₹414 weekly gain on MCX

సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.14 లాభపడి రూ.62,165 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.30 ఎగిసి రూ.62,786 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో 0.120 డాలర్లు క్షీణించి 22.365 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold price today: భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు | Gold price today: Yellow metal logs ₹414 weekly gain on MCX

After rising for two successive days, yellow metal price on Multi Commodity Exchange (MCX) witnessed profit-booking during weekend trade on Friday.
Story first published: Sunday, December 19, 2021, 20:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X