బంగారం ధరల్లో ఈ వారం కూడా స్వల్ప క్షీణత నమోదు కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్ గోల్డ్ కాంట్రాక్ట్ రూ.52,275 పైన కొనసాగితే మరింత పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేమని, అదే సమయంలో తగ్గతే మాత్రం రూ.50,580 వరకు దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఆ స్థాయికి దిగితే రూ.79,700 వరకు పలకవచ్చునని చెబుతున్నారు. రూ.52,275 మార్క్ దాటకుంటే అస్థిరంగా ఉన్నప్పటికీ దాదాపు అదేస్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్ రూ.71,100కు పైన ట్రేడ్ అయితే సానుకూలంగా ఉండవచ్చునని చెబుతున్నారు.

డాలర్ దెబ్బ.. పెరిగిన పసిడి ధర
అమెరికా డాలర్ ప్రభావం, యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ వడ్డీ రేటు వ్యాఖ్యలతో పసిడి ఫ్యూచర్ శుక్రవారం రెండు శాతం మేర పెరిగింది. ఈ ప్రభావం భారత బులియన్ మార్కెట్ పైన కనిపించింది. ఇక, ఈ రోజు బంగారం ధరలు రెండు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. స్పాట్ గోల్డ్ 0.4 శాతం ఎగిసి ఔన్స్ ధర 1,971.68 డాలర్లు పలికింది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఓ సమయంలో 1,976 డాలర్లు పలికింది. ఆగస్ట్ 19వ తేదీ నుండి ఇది గరిష్ట ధర. యూఎస్ గోల్డ్ ఫ్యూర్స 0.4 శాతం ఎగిసి ఔన్స్ ధర 1,982.50 డాలర్లు పలికింది. డాలర్ ఇండెక్స్ వరుసగా నాలుగో నెల పడిపోయింది. 0.2 శాతం మేర క్షీణించింది.

ధర పెరిగింది.. ఇప్పటికీ రూ.4500 తక్కువ
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు నేటి ఉదయం స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 10 గ్రాములు రూ.51,600 పలికింది. పసిడి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్ 2 శాతం ఎగిసి కిలో రూ.67,350 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి రూ.500 పెరిగింది. వెయ్యి కిలో రూ.1000కి పైగా ఎగిసింది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు రికార్డ్ స్థాయిలో రూ.56వేలకు పైకి చేరుకున్నాయి. ఆ ధరతో పోలిస్తే ఇప్పటికీ రూ.4,500 తక్కువగానే ఉంది.

హైదరాబాద్‌లో ధర
ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.50 వేల పైకి చేరుకుంది. చెన్నైలో రూ.49,130, ముంబైలో రూ.50,460, హైదరాబాద్‌లో రూ.49,120 పలికింది. హైదరాబాద్, విజయవాడల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరిగి రూ.53,600కు చేరుకుంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రూ.54,550 పలికింది.


Click it and Unblock the Notifications