Gold price today: బంగారం కీలక మద్దతు స్థాయి, రూ.47,000 దిగువనే

రెండు రోజుల క్రితం భారీగా పెరిగి రూ.47,000 క్రాస్ చేసిన బంగారం ధరలు నిన్న(బుధవారం), నేడు (గురువారం) మళ్లీ క్షీణించాయి. నిన్న బంగారం ధరలు రూ.250 వరకు క్షీణించాయి. నేడు మరో రూ.200 వరకు తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.190.00 (-0.41%) క్షీణించి రూ.46706.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.166.00 (-0.35%) తగ్గి రూ.46889.00 వద్ద ట్రేడ్ అయ్యాయి. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ, రూ.63,500 దిగువనే ఉంది.

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.127.00 (0.20%) పెరిగి రూ.63420.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.128.00 (0.20%) పెరిగి రూ.64253.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 7.00 (-0.39%) డాలర్లు క్షీణించి 1,787.80 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.091 (-0.38%) డాలర్లు క్షీణించి 23.692 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రెండు రోజుల క్రితం అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1790 డాలర్ల దిగువనే ఉంది.

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు

బంగారం ధరలు ఎలా ఉండవచ్చు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్ప తగ్గుదలతో లేదా స్థిరంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై బంగారం ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. అమెరికా ద్రవ్యోల్భణ డేటా అంచనాల కంటే దిగువనే నమోదయింది. కామెక్స్‌లో బంగారం ధరలు బుధవారం 0.6 శాతం మేర క్షీణించాయి.

గత వారం రోజుల్లో ఇదే గరిష్ట క్షీణత. మరోవైపు అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరిగాయి. బంగారం ధర 1800 డాలర్లకు ఎగువన నిలబెట్టుకోలేకపోయిందని, ఈ మార్కు దిగువకు చేరుకుందని, మరింత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం మరింత కాలం రూ.46,600 నుండి రూ.47,300 మధ్య కదలాడవచ్చునని అంటున్నారు.

మద్దతు ధర, నిరోధకస్థాయి

మద్దతు ధర, నిరోధకస్థాయి

వచ్చే వారం ఫెడ్ మీటింగ్ సమావేశానికి ముందు బలమైన ఆర్థిక రికవరీ కనిపిస్తోందని, ఈ నేపథ్యంలో కామెక్స్‌లో గోల్డ్ మద్దతు ధర 1775, నిరోధకస్థాయి 1810. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.46,700, నిరోధకస్థాయి రూ.47,200. కామెక్స్‌లో నేడు బంగారం 1797 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. నిన్న దాదాపు 0.7 శాతం మేర పడిపోయింది. గత మూడు సెషన్‌లుగా ఎంసీఎక్స్‌లో సిల్వర్ ధరలు రూ.62,400 నుండి రూ.64,000 దిగువన కనిపిస్తున్నాయి. గోల్డ్ మద్దతు ధర రూ.62,400, నిరోధకస్థాయి రూ.61,721.

కీలక మద్దతు

కీలక మద్దతు

పృథ్వీ ఫిన్ మార్ట్ కమోడిటీ ప్రకారం బంగారం మద్దతు ధర డాలర్లు 1,784 నుండి 1,772 డాలర్లు, నిరోధకస్థాయి 1,804 డాలర్ల నుండి 1,818 డాలర్లు, సిల్వర్ మద్దతు ధర 23.55 డాలర్ల నుండి 23.20 డాలర్లు, నిరోధకస్థాయి 24.14 డాలర్ల నుండి 24.50 డాలర్లు.

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.46,750-రూ.46,600, నిరోధకస్థాయి రూ.47,050-రూ.47,220, వెండి మద్దతు ధర రూ.62,900-రూ.62,500, నిరోధకస్థాయి రూ.63,700-రూ.64,100.

బంగారం కీలక మద్దతు రూ.46,900, రూ.46,975-రూ.47,200 టార్గెట్ ధరతో బంగారాన్ని రూ.46,900 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+