Gold price today: బంగారం ధరలు తగ్గుతున్నాయి, కీలక మద్దతుస్థాయి ఎక్కడంటే

బంగారం ధరలు గురువారం(సెప్టెంబర్ 9) క్షీణించాయి. కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు వేగం అందుకోవడానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు తోడవడంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. దీంతో ఈ ధరలు ఇటీవల వరుసగా తగ్గుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రూ.48,000ను తాకేలా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,000 దిగువకు పతనమైంది. పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9,300 తక్కువగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో రూ.16000 తక్కువగా ఉన్నాయి.

బంగారం ధరలు గురువారం(సెప్టెంబర్ 9) క్షీణించాయి. కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక కార్యకలాపాలు వేగం అందుకోవడానికి తోడు అంతర్జాతీయ పరిణామాలు తోడవడంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. దీంతో ఈ ధరలు ఇటీవల వరుసగా తగ్గుతున్నాయి. కొద్ది రోజుల క్రితం రూ.48,000ను తాకేలా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.47,000 దిగువకు పతనమైంది. పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9,300 తక్కువగా ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో రూ.16000 తక్కువగా ఉన్నాయి. నిన్న అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్ నిన్న రూ.81 పెరిగి రూ.47,020, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.84 లాభపడి రూ.47,204 వద్ద ముగిసింది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం క్షీణించింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.471 క్షీణించి రూ.64,150, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.398 తగ్గి రూ.65,030 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం 1800 డాలర్ల దిగువకు పడిపోగా, సిల్వర్ 24 డాలర్ల కంటే కిందకు చేరుకుంది.

అప్పుడు బంగారంపై పెట్టుబడి

అప్పుడు బంగారంపై పెట్టుబడి

గత ఏడాది కరోనా కారణంగా పెద్ద ఎత్తున ప్రజలు బంగారంపై ఇన్వెస్ట్ చేశారు. దీంతో 2020 ఆగస్ట్ 7వ తేదీన బంగారం రూ.56,000 క్రాస్ చేసింది. గత ఏడాది బంగారం 43 శాతం రిటర్న్స్ అందించింది. ఎందుకంటే బంగారం ఓ సమయంలో రూ.44,000 దిగువకు కూడా పడిపోయాయి. అయితే ప్రస్తుత ధరలను చూస్తే ఆల్ టైమ్ గరిష్టంతో 25 శాతం వరకు తక్కువగా ఉన్నాయి. బుధవారం బంగారం ధరలు నాలుగు వారాల కనిష్టానికి క్షీణించాయి.

ఫ్యూచర్ మార్కెట్లో ధర ఎంతంటే

ఫ్యూచర్ మార్కెట్లో ధర ఎంతంటే

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.126.00 (-0.27%) తగ్గి రూ.46912.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.91.00 (-0.19%) క్షీణించి రూ.47116.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.266.00 (-0.41%) తగ్గి రూ.63917.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.209.00 (-0.32%) తగ్గి రూ.64790.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.15 (-0.23%) డాలర్లు క్షీణించి 1,789.35 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.118 (-0.49%) డాలర్లు తగ్గి 23.938 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

బంగారం మద్దతుస్థాయి

బంగారం మద్దతుస్థాయి

బంగారం కీ లెవల్ రూ.46,975, కొనుగోలు స్థాయి రూ.47,000 పైన, టార్గెట్ ధర రూ.47,150 నుండి రూ.47,300. అమ్మకం స్థాయి రూ.46,960 దిగువ. టార్గెట్ ధర రూ.46,804 నుండి రూ.46,736.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.1 శాతం క్షీణించి 1,792.27 డాలర్లుగా ఉంది. బంగారం ఆగస్ట్ 26వ తేదీ నాటి కనిష్టం 1781.30 డాలర్ల స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

బంగారం ధరలు దేశీయంగా రూ.47,000 దిగువకు, అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల దిగువకు చేరుకున్నాయి. బంగారం కీలక మద్దతు స్థాయి రూ.47,000 నుండి రూ.46,800 మధ్య ఉంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ బలపడుతుండటంతో బంగారం ధర తగ్గుతుంది. డాలర్ ఇండెక్స్ 92.67 డాలర్లతో వారం గరిష్టానికి చేరుకుంది. అదే సమయంలో 10 ఇయర్ యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ స్వల్పంగా తగ్గాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+