బంగారం ధరలు భారీగా పెరిగాయి. డాలర్ బలహీనపడటం, అమెరికా ఎకనమిక్ డేటా పసిడి ధరలు పరుగు పెట్టడానికి ప్రధాన కారణమైంది. బంగారం ధరలు ఏకంగా రూ.48,750ని దాటేసి, రూ.49,000 దిశగా పరుగు పెడుతోంది. ఫెడ్ రిజర్వ్ ప్రకటన అనంతరం పసిడి ధరలు కాస్త చల్లబడినట్లుగా కనిపించినప్పటికీ, డాలర్ వ్యాల్యూ క్షీణించడం, ఎకనమిక్ డేటా ప్రభావం చూపింది. దీంతో నెలల గరిష్టానికి పసిడి ధర పరుగు పెడుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చాలా రోజుల తర్వాత 1800 డాలర్ల పైకి చేరుకుంది. రెండు రోజుల క్రితం సెషన్‌లో 1765 డాలర్ల సమీపంలో ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్, ఇప్పుడు 1805 డాలర్ల స్థాయికి చేరుకుంది. అంటే ఈ రెండు రోజుల్లో 40 డాలర్లు లాభపడింది. భారత కరెన్సీలో ఇది రూ.3000 పెరిగింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో కూడా రెండు రోజుల క్రితం రూ.48,000కి దిగువన ట్రేడ్ అయిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.49,000 దిశగా వెళ్తోంది.

భారీగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.114.00 (0.23%) లాభపడి రూ.48760.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.136.00 (0.28%) ఎగిసి రూ.48901.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.6.00 (+0.33%) డాలర్లు లాభపడి 1,804.20 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. రెండు రోజుల క్రితం సెషన్‌లో 1765 డాలర్ల సమీపంలో ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్ ఒక్క రోజులోనే భారీగా పెరగడంతో నిన్న 1798 డాలర్ల వద్ద ముగిసింది. 33 డాలర్లు పెరిగింది. నేడు మరింత లాభపడింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయంటే
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో సిల్వర్ ధర స్థిరంగా ఉంది. నిన్న భారీగా పెరిగిన సిల్వర్ ఫ్యూచర్స్ నేడు అతిస్వల్పంగా తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.59.00 (-0.09%) క్షీణించి రూ.62092.00 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.96.00 (-0.15%) 62660.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.017 డాలర్లు లాభపడి 22.468 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అందుకే పెరుగుదల
డాలర్ బలహీనత, అమెరికాలో నిరుద్యోగిత రేటు తిరిగి పెరగడం, ఎనకమిక్ డేటా బలహీనంగా ఉండటం వంటి వివిధ అంశాలు పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత క్లెయిమ్స్ గత వారం 1,84,000గా ఉండగా, ఈ వారం 2,06,000కు పెరిగాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా కూడా నిరుత్సాహపరిచింది. అక్టోబర్ నెలలో ఈ వృద్ధి 1.6 శాతంగా నమోదు కాగా, నవంబర్ నెలలో 0.5 శాతం మాత్రమే. యూకేతో పాటు పలు దేశాల్లో కరోనా మహమ్మారి పెరగడం కూడా సురక్షిత పెట్టుబడి దిశగా ఇన్వెస్టర్లు వెళ్లడానికి కారణమైంది.

మద్దతు ధర.. నిరోధకస్థాయి
బంగారం మద్దతు ధర 1,784-1,772 డాలర్లు. నిరోధకస్థాయి 1,810-1,822 డాలర్లు. సిల్వర్ మద్దతు ధర 22.20-21.84 డాలర్లు. నిరోధకస్థాయి 22.80-23.10 డాలర్లు.
ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర 48,400-48,180 డాలర్లు. నిరోధకస్థాయి 48,800-49,050 డాలర్లు. సిల్వర్ మద్దతు ధర రూ.61,660-61,220. నిరోధకస్థాయి రూ.62,660-63,300.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు



Click it and Unblock the Notifications