నిన్నటి ఉదయం సెషన్‌లో బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి, ఆ తర్వాత పెరిగాయి. నేడు కూడా అదే ఒరవడి కనిపిస్తోంది. నేడు (అక్టోబర్ 28 గురువారం) డిసెంబర్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో రూ.21.00 (0.04%) పెరిగి రూ.47983.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.41.00 (0.09%) లాభపడి రూ.48060.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు పైనే ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత రూ.48,022 వద్ద గరిష్టాన్ని తాకింది. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8200 తక్కువగా ఉంది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.215.00 (-0.33%) క్షీణించి రూ.64950.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.168.00 (-0.26%) తగ్గి రూ.65671.00 వద్ద ట్రేడ్ అయింది.

నిన్న తగ్గి మళ్లీ పెరిగాయి
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.133 లాభపడి రూ.47,946 వద్ద ముగిసింది. అయితే అంతకుముందు కీలకమైన రూ.48,000 మార్కుకు దిగువనే ఉంది. నిన్నటి సెషన్‌లో రూ.48,019ని కూడా టచ్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా నిన్న రూ.187 పెరిగి రూ.65,176 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1,798.80 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ఏడాది కాలంలో 7 శాతం మేర తగ్గింది. నిన్నటి సెషన్లో సిల్వర్ ఫ్యూచర్స్ 24.191 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. బంగారం ధరలు నిన్న ఉదయం తగ్గినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్లో నేడు
అంతర్జాతీయ మార్కెట్లో నేడు బంగారం ధరలు పెరిగాయి. నేటి పెరుగుదలతో మరోసారి 1800 డాలర్లు క్రాస్ చేసింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.05 (+0.23%) డాలర్లు ఎగిసి 1,802.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,795.75 డాలర్ల నుండి 1,805.05 డాలర్ల మధ్య కదలాడింది.
గోల్డ్ ఫ్యూచర్స్ 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు, కనిష్టం 1677.90 డాలర్లు. క్రితం సెషన్‌లో 1,798.80 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.046 (-0.19%) డాలర్లు క్షీణించి 24.145 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 24.043 - 24.172 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్టం.. గరిష్టం 21.410 - 29.930 డాలర్లు.

అందుకే బంగారం జంప్
అమెరికా డాలర్ క్రితం సెషన్‌లో కాస్త బలహీనపడింది. టెన్ ఇయర్ యూఎస్ బాండ్ యీల్డ్స్ ప్రభావం కూడా పసిడి పైన పడింది. ఈ బాండ్ యీల్డ్స్ 1.55 శాతం తగ్గాయి. డాలర్ బలహీనం, బాండ్ యీల్డ్స్ ప్రభావంతో పసిడి పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ట్రాయ్ ఔన్స్ 1784-1772 డాలర్ల మధ్య, నిరోధకస్థాయి 1808-1822 డాలర్లు. సిల్వర్ ఫ్యూచర్స్ మద్దతు ధర 24.00-23.70 డాలర్లు, నిరోధకస్థాయి 24.55-24.84 డాలర్లు.ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.47800-రూ.447660. నిరోధకస్థాయి రూ.48180-రూ.48440. సిల్వర్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.64800-రూ.64550. నిరోధకస్థాయి రూ.65660-రూ.66100.
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications