నిన్న స్వల్పంగా పెరిగిన గోల్డ్ ఫ్యూచర్ నేడు దాదాపు స్థిరంగా ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.100కు పైగా పెరిగింది. అయినప్పటికీ రూ.48,000 మార్కు దిగువనే ఉంది. నేడు (డిసెంబర్ 5, బుధవారం) ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ రూ.9.00 క్షీణించి రూ.47,940 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.22 తగ్గి రూ.48,034 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగింది. నిన్నటి సెషన్‌లో 1815 డాలర్ల వద్ద ముగిసిన గోల్డ్ ఫ్యూచర్స్, నేడు అదే స్థాయిలో ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.62,000 పైన ఉంది. నేడు స్వల్పంగా తగ్గినప్పటికీ ఈ మార్కుకు పైనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.131 క్షీణించి రూ.62,095 వద్ద, కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.044 డాలర్లు నష్టపోయి 23.012 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

పసిడిపై వీటి ప్రభావం
యూఎస్ డాలర్, అమెరికా బాండ్ యీల్డ్స్, ఒమిక్రాన్ అంశాలు పసిడి పైన ప్రభావం చూపుతున్నాయి. బలహీనమైన యూఎస్ డేటా నేపథ్యంలో డాలర్ బలహీనపడిందని, ఇది పసిడి ట్రెండ్‌కు సానుకూలంగా ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. అదే సమయంలో ద్రవ్యోల్భణ ఒత్తిళ్లు, పెట్టుబడి డిమాండ్ కూడా బంగారం ధరలకు మద్దతుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పసిడిని రూ.47,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.48,500 టార్గెట్ ధరతో, రూ.47,800 స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.

1800 డాలర్ల స్థాయిలో
బలహీనమైన అమెరికా డేటా, ద్రవ్యోల్భణ ఆందోళనలతో ఇన్వెస్టర్లు పసిడి వైపు చూస్తున్నారు. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా క్షీణించింది. ఈ నేపథ్యంలో కామెక్స్‌లో స్పాట్ గోల్డ్ మద్దతు ధర 1800 డాలర్లు, నిరోధకస్థాయి 1830 డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్ గోల్డ్ ఫిబ్రవరి మద్దతు ధర రూ.47,800, నిరోధకస్థాయి రూ.48,300గా పేర్కొంటున్నారు.
బంగారం బై-జోన్ రూ.48,100, టార్గెట్ ధర రూ.48,300. సెల్ జోన్ రూ.47,800, టార్గెట్ ధర రూ.47,600.

ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8200 తక్కువ
బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8200 వరకు తక్కువగా ఉన్నాయి. కొత్త క్యాలెండర్ ఏడాదిలో పసిడి దాదాపు స్థిరంగా కనిపిస్తోంది. 2022 తొలి అర్థ సంవత్సరంలో పసిడి రూ.45,000 స్థాయికి పడిపోతుందని, అయితే ఏడాది చివరి నాటికి మాత్రం రూ.55,000 స్థాయికి చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications