బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.358 పెరిగి రూ.46,636 వద్ద ముగిసింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.344 లాభపడి రూ.46,771 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం 1775 డాలర్లు దాటింది. ఎంసీఎక్స్‌లో రూ.60,000 దిగువకు పడిపోయిన సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న మళ్లీ ఆ మార్కును దాటింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (సెప్టెంబర్ 22, బుధవారం) ప్రారంభ సెషన్‌లో స్థిరంగా ఉంది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.71 నష్టపోయి రూ.46,567 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.112 క్షీణించి రూ.46,690 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.315 పెరిగి రూ.60,754 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.301 ఎగిసి రూ.61,570 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.25 డాలర్లు క్షీణించి 1,776.95 డాలర్ల వద్ద, ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 22.750 డాలర్ల వద్ద ఉంది.

ధరలు పైకి, కిందకు
బంగారం ధరలు క్రితం వారం రూ.46,000 దిగువన ముగిశాయి. అయితే నిన్న భారీగా లాభపడటంతో రూ.46,500 పైకి చేరుకున్నాయి. అలాగే రూ.60,000 దిగువన ఈ వారాన్ని ప్రారంభించిన సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న భారీగా లాభపడటంతో రూ.61,000 క్రాస్ చేసింది. నేడు మరింత పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల స్థాయి నుండి 1775 డాలర్లు దాటింది. నిన్న పసిడి ధరలు ఒక్కసారిగా జంప్ చేశాయి. కానీ నేడు కాస్త చల్లబడ్డాయి. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల దిశగా సాగుతోంది.

అందుకే బంగారం జంప్
చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ మరో లేమాన్ బ్రదర్స్ కాబోతుందని, మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చుననే ఆందోళనలు వచ్చాయి. దీంతో రెండు రోజుల క్రితం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అదే సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం ధరలు పెరిగాయి. పెడ్ నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. అందుకే నేడు బంగారం ధరలు దాదాపు స్థిరంగా కనిపిస్తున్నాయి.

మద్దతు ధర
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఊగిసలాటలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1,764-1,750 (ట్రాయ్ ఔన్స్) డాలర్లు, నిరోధకస్థాయి 1,788-1,800 డలర్లు, సిల్వర్ మద్దతు ధర 22.20-22.00 డాలర్లు, నిరోధకస్థాయి 22.88-23.00 డాలర్లు.
ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.46,400-రూ.46,180, నిరోధకస్థాయి రూ.46,800-రూ.47,055. సిల్వర్ మద్దతు ధర రూ.59,900-రూ.59,500. నిరోధకస్థాయి రూ.61,000-రూ.61,400.
రూ.59,400 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని వెండిని రూ.61,200 టార్గెట్ ధరతో రూ.59,900 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
ఎంసీఎక్స్‌లో గోల్డ్ నిరోధకస్థాయి రూ.46,800. ఈ స్థాయి దాటితే రూ.47,000 క్రాస్ చేస్తుందని భావిస్తన్నారు.

స్విస్ నుండి ఎగుమతులు పెరిగాయి
ఇదిలా ఉండగా, భారత్‌కు స్విస్ బంగారం ఎగుమతులు ఆగస్ట్ నెలలో ఐదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. అదే సమయంలో చైనా షిప్‌మెంట్స్ క్షీణించినట్లు స్విస్ కస్టమ్స్ డేటా వెల్లడిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద బులియన్ రిఫైనింగ్ కేంద్రం, ట్రాన్సిట్ హబ్ స్విట్జర్లాండ్. అదే సమయంలో బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో చైనా, భారత్ ఉన్నాయి 2020 చైనాకు, భారత్‌కు స్విస్ ఎగుమతులు క్షీణించాయి. ఈ ఏడాది ప్రారంభంలో కూడా తగ్గాయి. స్విస్ డేటా ప్రకారం ఆగస్ట్ నెలలో ఎగుమతులు ఆగస్ట్‌లో 21 116,442 కిలోలు, జూలైలో 21 94,081 కిలోలుగా నమోదయ్యాయి.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications