Gold Price Today: తగ్గి, పెరిగిన బంగారం ధర, ఏ స్థాయిలో కొనుగోలు చేయవచ్చు?
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న దాదాపు రూ.900 తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.100 వరకు క్షీణించింది. కానీ నేడు (డిసెంబర్ 2) మళ్లీ పెరిగింది. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు దిగువన, వెండి రూ.60,000 స్థాయిలో ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్ ధర ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8400 వరకు తక్కువగా ఉంది. వెండి రూ.79,000 గరిష్టంతో రూ.18,000కు పైగా తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లు. ఈ గరిష్టస్థాయితో దాదాపు 300 డాలర్లు తక్కువగా ఉంది.

బంగారం ధర నిన్న తగ్గి, నేడు పెరిగింది
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.205.00 (0.43%) తగ్గి రూ.47,783 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,799 వద్ద ట్రేడ్ అయింది. ఇటీవల గత కొద్ది సెషన్లుగా గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,500 నుండి రూ.48,000 దిగువనే కదలాడుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 4 డాలర్ల మేర క్షీణించి 1780 డాలర్ల వద్ద కదలాడింది. క్రితం సెషన్లో 1784 డాలర్ల వద్ద ముగిసింది. నేడు క్షీణించింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు మూడు శాతం పెరిగింది.

వెండి ధరలు
వెండి ధరల విషయానికి వస్తే డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ వరుసగా రెండు రోజులుగా క్షీణిస్తోంది. నేటి సెషన్‌లో రూ.900కు పైగా తగ్గి రూ.60,556 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.61,200 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు 0.046 డాలర్లు పెరిగి 22.385 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.క్రితం సెషన్లో సిల్వర్ ఫ్యూచర్స్ 22.339 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో ఇది 7 శాతానికి పైగా క్షీణించింది.

ఎక్కడ కొనుగోలు చేయవచ్చు
బంగారం ధరలు రూ.47,500 నుండి రూ.48,000 మధ్య ట్రేడ్ అవుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రూ.48,000 తక్షణ నిరోధకస్థాయిగా మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. మద్దతు ధర రూ.47,700 నుండి రూ.47,500. రూ.48,300 టార్గెట్ ధరతో రూ.47,500 స్టాప్ లాస్‌తో రూ.47,700 నుండి రూ.47,800 మధ్య కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. సిల్వర్ మద్దతు ధర రూ.62,100 నుండి రూ.61,900. వెండిని రూ.63,000 టార్గెట్ ధరతో రూ.61,400 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.62,000 దిగువన కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది.


Click it and Unblock the Notifications