అంతకుముందు వారం భారీగా పెరిగి రూ.48,000 క్రాస్ చేసిన బంగారం ధరలు, ఈ వారం ఆ మార్కు దిగువకు వచ్చాయి. చివరి సెషన్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.108 క్షీణించి రూ.47,526 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.142.00 క్షీణించి రూ.47790.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం ప్రారంభం నుంచి వారం ముగిసేవరకు బంగారం ధరలు దాదాపు రూ.1000 వరకు తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్ ధరలు రూ.67,000 స్థాయికి వచ్చాయి.
బంగారం మున్ముందు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని, కొనుగోలుదారులు ప్రస్తుతం బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. డెల్టా వేరియంట్ సహా వివిధ అంశాల కారణంగా ప్రపంచ ద్రవ్యోల్భణంపై ఆందోళన పెరుగుతోందని, ఇది బంగారానికి ఊతమిస్తోందని చెబుతున్నారు. అమెరికా, యూరోప్, ఆగ్నేయ ఆసియా దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఇది పసిడి పైన ఒత్తిడి పెంచుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ప్రస్తుతం 1800 డాలర్ల పైన ఉంది. బంగారం మద్దతు ధర రూ.46,500 నుండి రూ.46,200 మధ్య ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. షార్ట్ టర్మ్‌లో పసిడి క్షీణించినప్పుడు కొనుగోలు చేయవచ్చునని, పది గ్రాముల గోల్డ్ సమీప భవిష్యత్తులో రూ.48,500కు చేరుకోవచ్చునని చెబుతున్నారు. బంగారం ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8500 తక్కువగా ఉంది.
More From GoodReturns

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications