Gold price today: రూ.49,000 వద్ద బంగారం ధర, వెండి రూ.66,000 పైనే
నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు(నవంబర్ 17 బుధవారం) స్థిరంగా లేదా స్వల్ప పెరుగుదలతో ఉన్నాయి. గతవారం పసిడి ధరలు రూ.1000కి పైగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చాయి. అయితే ఈ వారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. డాలర్ వ్యాల్యూ తిరిగి పుంజుకోవడంతో పాటు పలు అంశాలు పసిడి ధరల స్వల్ప పెరుగుదలకు లేదా దాదాపు స్థిరంగా ఉండటానికి కారణమయ్యాయి.
అలాగే అమెరికా రిటైల్ సేల్స్ పుంజుకోవడం డాలర్ వ్యాల్యూ పదహారు నెలల గరిష్టం వద్ద ఉండటం ప్రభావం చూపింది. మంగళవారం విడుదలైన యూఎస్ రిటైల్ సేల్స్ డేటా డాలర్ ఇండెక్స్‌కు దోహదపడింది. దీంతో నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి.

మద్దతు ధర, నిరోధకస్థాయి
బంగారం ధరలు నేడు ఊగిసలాటలో ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ట్రాయ్ ఔన్స్ 1832 డాలర్ల వద్ద, సిల్వర్ 24.50 డాలర్ల స్థాయిలో ఉండవచ్చునని భావిస్తున్నారు. బంగారం మద్దతు ధర 1,840-1,830 డాలర్లు, నిరోధకస్థాయి 1,865-1,875 డాలర్లు. వెండి మద్దతు ధర 24.75-24.50 డాలర్లు, నిరోధకస్థాయి 25.25-25.50 డాలర్లు.
ఎంసీఎక్స్‌లో గోల్డ్ మద్దతు ధర రూ.48,860-48,650, నిరోధకస్థాయి రూ.49,300-49,480, వెండి మద్దతు ధర రూ.65,900-65,500, నిరోధకస్థాయి రూ.66,700-67,300.

రూ.49,000 స్థాయికి బంగారం
ఎంసీఎక్స్‌లో నేడు బంగారం ధర దాదాపు స్థిరంగా ఉంది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.32.00 (-0.07%) తగ్గి రూ.49006.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.43.00 (-0.09%) క్షీణించి రూ.49218.00 వద్ద ట్రేడ్ అయింది. ఈ వారం ప్రారంభంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.49,500కు సమీపంలో ఉంది. వారం మొత్తంలో తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు స్థిరంగా ఉంది. ప్రారంభంలో కాస్త పెరిగినప్పటికీ ఆ తర్వాత క్షీణించింది. గోల్డ్ ఫ్యూచర్స్ 0.35 (0.02%) డాలర్లు పెరిగి 1,854.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,854.10 డాలర్ల వద్ద ముగిసింది. ఇప్పటికీ 1850 డాలర్ల పైనే ఉంది. ఇటీవల 1900 డాలర్ల దిశగా కనిపించినప్పటికీ డాలర్ బలపడటం ప్రభావం చూపింది.

సిల్వర్ ఫ్యూచర్
సిల్వర్ ఫ్యూచర్స్ రూ.66,000కు పైనే ఉంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.66.00 (0.10%) పెరిగి రూ.66300.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67.00 (0.10%) లాభపడి రూ.67.00 (0.10%) వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.094 (+0.38%) డాలర్లు లాభపడి 25.038 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.944 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications