రూ.48,000 క్రాస్ చేసిన బంగారం ధర, ఏ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు?
బంగారం ధరలు మళ్లీ రూ.48,000 క్రాస్ చేశాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం వారం రూ.48,189 వద్ద ముగిసింది. చివరి సెషన్లో రూ.250 పెరిగింది. గత శుక్రవారం అమెరికా ద్రవ్యోల్భణ డేటా విడుదలైంది. ఈ ప్రభావం పసిడి మార్కెట్ పైన కనిపించింది. అంతర్జాతీయ ద్రవ్యోల్భణం, డాలర్ మారకంతో రూపాయి క్షీణత, బంగారం, వెండికి పారిశ్రామిక డిమాండ్ వంటి అంశాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. ఒమిక్రాన్ ప్రభావం అంచనాల నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లు ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించారు.

బంగారం ధరలు దాదాపు స్థిరంగా
గతవారం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,900 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో పసిడి ఎక్కువగా రూ.47,900 నుండి రూ.48,200 మధ్య కదలాడింది. అయితే ఎక్కువగా రూ.48,000 దిగువనే కనిపించింది. కానీ చివరి సెషన్లో రూ.250 పెరిగి, రూ.48,200కు చేరువైంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి క్రితం వారం రూ.48,189 వద్ద ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.175.00 (0.36%) లాభపడి రూ.48,300 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్లకు చేరువైంది. అయితే ఈ మార్కుకు 17 డాలర్ల దూరంలో ఉంది. చివరి సెషన్లో 6.50 డాలర్లు లాభపడి 1783 డాలర్ల వద్ద ముగిసింది.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్ మార్చి చివరి సెషన్లో రూ.381 పెరిగి రూ.61,179 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.361 ఎగిసి రూ.61,756 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 22.210 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.రూ.8000 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.17000 తక్కువగా ఉంది.

అందుకే పసిడి జంప్
శుక్రవారం అమెరికా ద్రవ్యోల్భణ డేటా విడుదలైంది. సీపీఐ 6.80 శాతానికి పెరిగింది. గతవారం మొదటి నుండి ఇన్వెస్టర్ల ఒమిక్రాన్ అప్రమత్తత వల్ల స్వల్ప పెరుగుదల, చివరలో ద్రవ్యోల్భణ డేటా ప్రభావం వల్ల చివరి సెషన్‌లో పసిడి భారీగా పెరిగింది. అమెరికా సీబీఐ 1982 తర్వాత గరిష్టాన్ని నమోదు చేసినట్లు వెల్లడైంది.

ఈ డిప్‌లో కొనుగోలు చేయవచ్చు
బంగారాన్ని డిప్‌లో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 1760 డాలర్ల వద్ద మద్దతు ధర, 1820 డాలర్ల వద్ద తక్షణ నిరోధకస్థాయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1820 డాలర్ల లక్ష్యంతో 1780 డాలర్ల నుండి 1790 డాలర్ల మధ్య కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.48,700 టార్గెట్ ధరతో రూ.47,800 నుండి రూ.48,100 మధ్య కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications