For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఈ వారం ఎలా ఉండవచ్చు, మరింత తగ్గే అవకాశముందా?

|

ముంబై: బంగారం ధరలు ఈ వారం బలహీనంగా కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో పది గ్రాముల పసిడి రూ.48,250 వద్ద మద్దతు లభించే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.47,900 వద్ద మద్దతు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. వెండి ఫ్యూచర్ రూ.66,950 ఎగువన లేకుంటే మరింత దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత వారం పసిడి 0.24 శాతం మేర క్షీణించింది. వారంలోని ఐదు సెషన్లలో మూడు సెషన్లలో ధరలు తగ్గాయి.

 SBI, PNB, యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లు: ఎక్కడ ఎక్కువ అంటే SBI, PNB, యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లు: ఎక్కడ ఎక్కువ అంటే

పసిడిపై వీటి ప్రభావం

పసిడిపై వీటి ప్రభావం

పసిడి ధరలు గత మూడు నాలుగు సెషన్లుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అధిక రిటర్న్స్ కోరుకునే ఇన్వెస్టర్లకు, బిడెన్ తాజా ఉద్దీపన ప్యాకేజీకి మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పెరుగుతున్న ఆర్థిక లోటు, రుణాలతో పాటు రాజకీయ అనిశ్చితుల ప్రభావం బంగారంపై ఉంటోంది. ఇటీవల అమెరికా క్యాపిటల్ భవన ముట్టడి, ఉద్దీపన బంగారం పెరుగుదలకు దోహదపడే అంశాలు. అదే సమయంలో ప్యాకేజీపై నిరాసక్తత బంగారం క్షీణతకు దారి తీయడానికి కారణమైంది. కరోనా వ్యాక్సినేషన్, డాలర్ పెరుగుదల కూడా పసిడిపై ఒత్తిడిని తగ్గించింది.

1800 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు

1800 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చు

గత వారం చివరి సెషన్లో పసిడి ధరలు ర్యాలీ చేస్తున్నట్లుగా కనిపించాయి. అయితే ఆ తర్వాత క్షీణించాయి. అమెరికా డాలర్ రికవరీ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల స్థాయికి పడిపోయే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

చమురు ధరలు

చమురు ధరలు

సహజవాయువు జనవరి కాంట్రాక్ట్ ఈ వారం 197.65 కంటే దిగువ కదలాడకుంటే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. క్రూడాయిల్ ధరలు గతవారం స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 56 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 53 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

బంగారం ధరలు ఈ వారం ఎలా ఉండవచ్చు, మరింత తగ్గే అవకాశముందా? | gold price predictions: Weekly Fundamental Forecast

Between investors seeking higher yielding and more growth-sensitive assets and a sense of disappointment over the Biden stimulus package, gold prices are struggling.
Story first published: Monday, January 18, 2021, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X