Gold Price Prediction: బంగారం ధరలు ఈ వారం ఎలా ఉండవచ్చు?
బంగారం ధరలు ఈవారం కూడా కాస్త పైకి చేరే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,930 కంటే దిగువకు వస్తే షార్ట్ సెల్ పొజిషన్ల వైపు మొగ్గు చూపవచ్చునని, రూ.46,600 వద్ద మద్దతు లభించవచ్చునని, ఈ స్థాయిని కోల్పోతే మాత్రం రూ.45,400 దిగువకు పడిపోవచ్చునని భావిస్తున్నారు. ఈ స్థాయిని కోల్పోతే రూ.48,390 సమీపంలో నిరోధం ఎదురు కావొచ్చన్నారు. వెండి డిసెంబర్ ఫ్యూచర్ రూ.67,410 వద్ద మద్దతు లభించవచ్చు. ఈ స్థాయి కంటే దిగువకు వస్తే రూ.65,200 వరకు పడిపోవచ్చు.

బంగారం ధరలు ఎలా ఉండవచ్చంటే
గతవారం వరుసగా నష్టపోయిన బంగారం ధరలు, చివరి సెషన్లో కాస్త పుంజుకున్నాయి. దీంతో 1800 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్, ఆ తర్వాత 1819 వద్ద పరీక్షను ఎదుర్కోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధర గతవారం ఓ సమయంలో రూ.47,000 దిగువకు పడిపోయింది. చివరకు రూ.47270.00 వద్ద ముగిసింది. ఈ వారం కూడా పసిడి ధరలు కాస్త అస్థిరంగా ఉన్నప్పటికీ, పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు.

మార్కెట్
గతవారం సరికొత్త శిఖరాలను తాకిన మార్కెట్లు ఈవారం కూడా దూకుడుగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన ప్రకటనలు వెలువడటంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఫండమెంటల్స్‌పై దృష్టి సారించే అవకాశముంది. నిఫ్టీ 15,050 నుండి 15,400 మధ్య ఉండవచ్చునని, కరెక్షన్ కనిపిస్తే మాత్రం 14,700 దిగువకు పడిపోవచ్చునని భావిస్తున్నారు.

ముడి చమురు
ఫిబ్రవరి ముడి చమురు కాంట్రాక్ట్ రూ.3,930 దిగువకు రాకుంటే సానుకూలంగా కొనసావచ్చునని అంచనా వేస్తున్నారు. రాగి ఫ్యూచర్ రూ.597 కంటే దిగువన ముగిస్తే రూ.602 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ సేల్ చేయవచ్చునని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications