ఆరేళ్లలో భారీగా పడిపోయిన బంగారం ధర, ఈ సంవత్సరం ఎలా ఉండవచ్చు?
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధరలు ప్రస్తుతం రూ.48,000 స్థాయిలో ఉన్నాయి. నవంబర్ 24వ తేదీన సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన అనంతరం బంగారం ఎత్తుపల్లాలను చూసింది. రూ.47,000 స్థాయిలో ఉన్న పసిడి ఆ తర్వాత రూ.50,000 దిశగా కనిపించింది. అయితే ఒమిక్రాన్ ప్రభావం అంతంతే అని తెలియడంతో పసిడి ధర కాస్త క్షీణించింది. హాఫ్ సెంచరీ దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్ ధర 2021 ఏడాదిలో రూ.48,000 స్థాయిలో ముగిసింది. 2021లో ఓ సమయంలో రూ.45,000 దిగువకు పడిపోయిన పసిడి, ఆ తర్వాత మాత్రం లాభపడింది. కానీ మొత్తానికి 2021 ఏడాదిలో భారీగా క్షీణించింది.

ఏడాదిలో 4 శాతం తక్కువ
బంగారం 2020 ఆగస్ట్ నెలలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 2075 డాలర్లను సమీపించింది. అయితే ప్రస్తుతం ఆ స్థాయికి చాలా దూరంలో ఉంది. 2021 సంవత్సరంలో బంగారం భారీగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత తగ్గింది. కానీ గత ఏడాదిలో మొత్తంగా 4 శాతం క్షీణించింది. ఆరేళ్ళలో భారీ క్షీణత ఇదే. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8000 తక్కువగా ఉంది. క్రితం సంవత్సరం లేదా చివరి సెషన్‌లో రూ.48,083 వద్ద ముగిసింది.

డిప్ సమయంలో కొనుగోలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గత వారం భారీగా పెరిగింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ డిసెంబర్ చివరలో కాస్త బలపడింది. దీంతో దేశీయ మార్కెట్లో అంతర్జాతీయ స్థాయిలో పెరగలేదు. గత పదిహేను రోజుల్లో డాలర్ మారకంతో రూపాయి 2 వరకు ఎగిసింది.1800 డాలర్ల దిగువన ఉన్న పసిడి గతవారం 1830 డాలర్లకు చేరుకుంది.
బంగారం సమీప భవిష్యత్తులో 1880 డాలర్ల నుండి 1900 డాలర్లకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత డిప్‌లో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. పసిడి 2022లో 1900 డాలర్లను క్రాస్ చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

బంగారం ధరలు ఈ ఏడాది..
ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,500గా అంచనా వేస్తున్నారు. సమీప భవిష్యత్తులో బంగారం రూ.47,800 నుండి రూ.47,900కు రావొచ్చునని, ఆ తర్వాత రూ.49,300కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం బంగారం కొనుగోలుకు మంచి అవకాశమని, ఆ తర్వాత ఈ సంవత్సరమే రూ.49,000 క్రాస్ చేయవచ్చునని అంటున్నారు. 2022 చివరి నాటికి పసిడి ధర 55,000 చేరుకోవచ్చుననే అంచనాలు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications