Gold price: వచ్చే ఏడాది బంగారం రూ.63,000ను తాకుతుందా?
బంగారం ధరలు 2021లో రికార్డ్‌స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారాన్ని ఎప్పుడు కూడా సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. ఫ్యూచర్ మార్కెట్లో ఆగస్ట్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 తాకింది. ఆ తర్వాత తగ్గి ప్రస్తుతం రూ.50,000 స్థాయిలో ఉంది. వచ్చే ఏడాది రూ.63,000ను తాకవచ్చునని అంటున్నారు.
అమెరికా తాజా ఆర్థిక ప్యాకేజీ, అమెరికన్ డాలర్ క్షీణత వంటి అంశాలు ప్రభావం చూపుతాయన్నారు. 2020లో కరోనా కారణంగా బంగారం భారీ రిటర్న్స్ అందించింది. ఓ సమయంలో 35 శాతం రిటర్న్స్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత 25 శాతం రిటర్న్స్‌కు పరిమితమైంది. గత కొన్ని దశాబ్దాల్లో పసిడిపై అత్యధిక రిటర్న్స్ ఇదే కావడం గమనార్హం.

2020 సంవత్సరంలో పసిడి దేశీయ మార్కెట్లో 39,100 వద్ద, అంతర్జాతీయ మార్కెట్లో 1517 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనాకు ముందు 38,400 పలికినప్పటికీ, మార్చి నుండి అంతకంతకూ ఎగిసి రూ.56,200 క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,072 డాలర్లు దాటింది. కరోనా కేసులు పెరగకపోయినప్పటికీ, అమెరికా సహా వివిధ దేశాల ఆర్థిక ప్యాకేజీ, వడ్డీ రేట్ల తగ్గింపు వంటి అంశాల వల్ల పసిడిపై పెట్టుబడులు పెరగవచ్చునని, అదే సమయంలో ధర కూడా వచ్చే ఏడాది రూ.63,000కు చేరుకోవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications