ఫెడ్ రిజర్వ్ మీటింగ్ నేపథ్యంలో నిన్నటి వరకు అప్రమత్తంగా కదలాడిన బంగారం ధరలు ఆ తర్వాత పెరుగుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500 దిశగా పరుగు పెడుతోంది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (డిసెంబర్ 16) ప్రారంభ సెషన్‌లో రూ.268 పెరిగి రూ.48,355 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.239 పెరిగి రూ.48,496 వద్ద ట్రేడ్ అయింది. రూ.60,000 స్థాయిలో ఉన్న వెండి ధర రూ.1000కి పైగా పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,172.00 పెరిగి రూ.61,380 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,124.00 పెరిగి రూ.61,962 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు అదే స్థాయిలో పెరిగాయి. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ 17.60 డాలర్లు లేదా 1 శాతం పెరిగి 1782 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 22 డాలర్ల దిగువ నుండి ఇప్పుడు ఈ మార్కును క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.590 డాలర్లు పెరిగి 22.137 డాలర్లకు చేరుకుంది. వెండి ఏడాదిలో 11 శాతం క్షీణించగా, ఇదే కాలంలో బంగారం దాదాపు 5 శాతం తగ్గింది.

నిన్న భారీగా తగ్గి...
బంగారం ధరలు క్రితం సెషన్‌లో భారీగా తగ్గాయి. ఫెడ్ రిజర్వ్ మీటింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు మొదట క్షీణించినప్పటికీ, నేడు మాత్రం పరుగు పెడుతోంది. నిన్న దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,065 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,263 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో దారుణంగా పతనమై 1764 డాలర్ల వద్ద ముగిసింది. అయితే ఫెడ్ రిజర్వ్ అనంతరం మాత్రం బంగారం ధర పుంజుకుంది. ఈ ప్రభావం దేశీయ ప్యూచర్ మార్కెట్ పైన ఉంటుంది. దీంతో ఎంసీఎక్స్‌లో ధరలు పెరుగుతున్నాయి.

అందుకే పసిడికి సానుకూలత
ఫెడ్ బాండ్ టాపెరింగ్ వార్తలు వచ్చినప్పటికీ బంగారం ధరలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందని, అయితే ఇది షార్ట్ టర్మ్ మాత్రమేనని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ ధరలు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. 2022లోనే వడ్డీ రేట్ల పెంపుపై ఫెడ్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో పసిడి ధరలు క్రమంగా తగ్గవచ్చునని అంటున్నారు. వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతాయనే అంశం పసిడికి తాత్కాలికంగా సానుకూలతను కలిగించిందని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications