బంగారం ధరలు మరో రూ.1,000 తగ్గనున్నాయా? వెండి ఆ స్థాయి కంటే కిందకు వస్తే..

బంగారం ధరలు దిద్దుబాటుకు గురవుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుండి రూ.40వేల దిగువన ఉన్న పసిడి ధరలు ఓ సమయంలో రూ.56,200కు చేరుకున్నాయి. రష్యా వ్యాక్సీన్ ప్రకటనతో ఆగస్ట్ రెండో వారం నుండి క్షీణిస్తున్నాయి. రెండు నెలల పాటు రూ.50 వేల నుండి రూ.52వేల మధ్య స్థిరంగా ఉన్న ధరలు మోడర్న్, ఫైజర్ వ్యాక్సీన్ ఫలితాల ప్రకటన తర్వాత మరింత దిద్దుబాటుకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా కరోనా కేసులు తగ్గితే మరింత క్షీణిస్తుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత తగ్గనున్న బంగారం ధర

మరింత తగ్గనున్న బంగారం ధర

గతవారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,106 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.రూ.48,114 వద్ద క్లోజ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ కిలో రూ.59,100 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.60,333 వద్ద క్లోజ్ అయింది. ఫిబ్రవరి కాంట్రాక్ట్ మరింత దిద్దుబాటుకు గురి కావొచ్చునని భావిస్తున్నారు. మరో రూ.1,000 వరకు పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. రూ.48,000 దిగువకు కూడా రావొచ్చునని భావిస్తున్నారు. ఇక వెండి మార్చి ఫ్యూచర్ కూడా ప్రతికూలంగా ఉండవచ్చునని, రూ.63,215 కంటే పైకి చేరకుంటే మరింత పడిపోవచ్చునని భావిస్తున్నారు.

1700 డాలర్ల దిగువకు...

1700 డాలర్ల దిగువకు...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు నేడు మరింత క్షీణించాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 13.90 (-0.78%) డాలర్లు తగ్గి 1,774 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. 1775 డాలర్ల దిగువకు వచ్చింది. ఏడాదిలో 19 శాతానికి పైగా పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.419 (-1.85%) డాలర్లు క్షీణించి 22 డాలర్లకు పైగా పలికింది. ఓ సమయంలో 29 డాలర్లకు ఎగిసిన వెండి ఇప్పుడు 23 డాలర్ల దిగువకు వచ్చింది. పసిడి 2072 డాలర్ల నుండి 1774 డాలర్లకు వచ్చింది. అమెరికాలో తాజా ఉద్దీపన ప్యాకేజీపై ఎలాంటి కదలిక లేకపోవడంతో స్వల్పకాలిక పెట్టుబడిదారులు ప్రభావితమవుతున్నారు. వచ్చే ఏడాది వ్యాక్సీన్ వస్తుందనే అంచనాతో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే 1800 డాలర్ల దిగువకు వచ్చిన పసిడి 1699 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.

వచ్చే పదేళ్లలో భారీ పెరుగుదల

వచ్చే పదేళ్లలో భారీ పెరుగుదల

కరోనా ప్రారంభమైనప్పటి నుండి పసిడి ధరలు 1461.70-2099 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు సమీపకాలంలో పడిపోయినప్పటికీ వచ్చే పదేళ్ల కాలంలో భారీ పెరుగుదలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+