బంగారం ధరలు ఈ వారం దాదాపు స్థిరంగా ముగిశాయి. రూ.46,000 దిగువనే ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్, చివరి సెషన్‌లో అదే స్థాయిలో ముగిసింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.61.00 (-0.13%) క్షీణించి రూ.45995.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.119.00 (-0.26%) తగ్గి రూ.46058.00 వద్ద ముగిసింది. ఈ వారంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,900 నుండి రూ.47,000 మధ్య కదలాడాయి. చివరకు వారం ప్రారంభమైన చోటే ముగిసింది. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ కూడా అలాగే ప్రారంభమై, దాదాపు అలాగే ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.59,740 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో రూ.63,000 క్రాస్ చేసింది. మళ్లీ ధరలు పడిపోయి చివరకు రూ.59,920 వద్ద ముగిసింది. చివరి సెషన్లో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.869.00 (-1.43%) క్షీణించి రూ.59920.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.874.00 (-1.42%) తగ్గి రూ.60600.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల వద్ద ప్రారంభమై, చివరి సెషన్‌లో ఇదే స్థాయిలో ముగిసింది. కామెక్స్‌లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.60 (+0.03%) పెరిగి 1,750.40 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.264 డాలర్లు క్షీణించి 22.415 డాలర్ల వద్ద ముగిసింది.
అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రకటన నేపథ్యంలో బంగారం ధరలు అంతర్జాతీయంగా, దేశీయంగా మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.44,200 దిగువకు పడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,000కు పైగా తక్కువగా ఉంది. ఇయర్ టు డేట్ (2021 జనవరి నుండి) ఇప్పటి వరకు బంగారం 7 శాతం మేర క్షీణించింది.

బాండ్స్ కొనుగోలు
ఫెడ్ రిజర్వ్ ప్రకటన, అంతర్జాతీయంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం, అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీస్తుండటం వంటి అంశాలు బంగారం పైన ప్రభావం చూపుతున్నాయి. బాండ్స్ కొనుగోలును నవంబర్ నుండి తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ ప్రకటించింది, దీంతో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారంపై పెట్టుబడి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గింది.

మరింత తగ్గొచ్చు
బంగారం ధరలు వచ్చే వారం కూడా పతనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ సరైన పథంలో ఉందని యూఎస్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ వెల్లడిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పినట్లయితే మాత్రమే ద్రవ్య విధానాలను కఠినతరం చేయడానికి ఫెడ్ ప్రణాళికలు ఉంటాయి. కానీ రికవరీ కనిపిస్తోంది. అలాగే, చైనీస్ రియాల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ ప్రకటన నేపథ్యంలో ఆర్థిక మార్కెట్లలో ప్రభావం కనిపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు సానుకూలంగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications