ప్రాఫిట్ టేకింగ్ వల్లే.. ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?
గతవారం చివరి సెషన్‌లో బంగారం ధరలు మొదట ర్యాలీ చేశాయి. కానీ చివరకు స్వల్పంగా క్షీణించాయి. మొత్తంగా క్రితం వారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.49,209 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 1,842.10 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. గతవారం అన్ని సెషన్లలో పసిడి ధరలు ఎగిసినప్పటి, చివరకు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా రూ.12,000కు పైగా పెరిగింది. గతవారం చివరలో ప్రాఫిట్ బుకింగ్ సంకేతాల నేపథ్యంలో ధరలు చివరలో తగ్గాయి.

మొత్తంగా పెరుగుదల
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ధర (ఫిబ్రవరి ఫ్యూచర్స్) గతవారం రూ.49,209 వద్ద ముగిసింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.49,225 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1,842.10 డాలర్లు, వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 24.315 డాలర్ల వద్ద ముగిసింది. గతవారం మొత్తంగా పసిడి ధరలు 2.66 శాతం మేర పెరిగాయి. రూ.52వేలకు పైగా ఉన్న పసిడి అంతకుముందు వారం రూ.48వేల దిగువకు వచ్చింది. గతవారం రూ.49వేల పైకి చేరుకుంది.

ప్రాఫిట్ టేకింగ్
ఈ వారం కూడా ప్రాఫిట్-టేకింగ్ నమోదు కావొచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. వ్యాక్సీన్ రాక, కరోనా కేసులు తగ్గడం వంటి వివిధ కారణాల వల్ల దీర్ఘకలంలో బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యాక్సీన్ వస్తే మరింతగా తగ్గుతుందనే ఉద్దేశ్యం ఉంది. అప్పుడు బంగారంపై పెట్టుబడులు మరింతగా పెరగవచ్చు. అయితే దీర్ఘకాలానికి మాత్రం ప్రస్తుత స్థాయిలోను పెట్టవచ్చునని అంటున్నారు.

2100 డాలర్లకు..
బంగారం ధరలు ప్రస్తుతం 1850 డాలర్ల దిగువన ఉన్నాయి. నవంబర్ నెలలో 1900 డాలర్ల వద్ద ఒత్తిడికి గురయ్యాయి. ఇప్పుడు కూడా ఆ స్థాయికి చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. లాంగ్ టర్మ్‌లో పసిడి ధర 2000 డాలర్లకు తిరిగి చేరుకుంటుందని, 2100 డాలర్లను కూడా అందుకోవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications