బంగారం ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా, రూ.46,000కు పడిపోతుందా?
ముంబై: 250 బేసిస్ పాయింట్ల పన్ను తగ్గింపు, ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటం వంటి అంశాలు ఫిజికల్, ఫ్యూచర్ గోల్డ్ మార్కెట్ పైన ఒత్తిడిని కలిగించాయి. బడ్జెట్ ముందు ధర కంటే పసిడి ఈ నాలుగు సెషన్లలోనే 5 శాతం మేర లేదా రూ.2500 వరకు తగ్గింది. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఇప్పుడు రూ.9000కు పైగా తక్కువగా ఉంది. బడ్జెట్ అనంతరం బంగారం చిన్నగా కరెక్షన్‌కు గురయిందని, పసిడి ధరలు మరింతగా తగ్గే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. బడ్జెట్ అనంతరం బంగారం ధర రూ.2500 వరకు పడిపోయింది.

అందుకే బంగారం ధరలు డౌన్
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడానికి తోడు వ్యాక్సినేషన్ వంటి వివిధ కారణాలతో పసిడి ధరలు అంచనాల కంటే మరింతగా పడిపోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే తక్కువ స్థాయి కొనుగోళ్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు బంగారానికి కాస్త మద్దతు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ చాలా వేగంగా ఉందని, డాలర్ సూచీ, ట్రెజరీ ఈల్డ్స్‌లో రికవరీ కనిపించిందని, ఇది బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు.

రూ.46,000 స్థాయికి
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం ఔన్స్ పసిడి 1800 డాలర్ల దిగువకు వచ్చి, 1770 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. భారత్‌లో షార్ట్ టర్మ్ టార్గెట్ రూ.46,800గా అంచనా వేస్తున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ఆ మేరకు దిగితే రూ.46,000 స్థాయికి పడిపోవచ్చునని అంటున్నారు. అదే జరిగితం పసిడి రూ.47,600 కంటే 3 శాతం కంటే పైగా తగ్గుతుంది. రికవరీ ధర రూ.49,200గా ఉండవచ్చునని చెబుతున్నారు. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ పెరగడం, ఈటీఫ్ కొనుగోళ్లు పెరగడం, ఎగుమతులు పెరగడం వంటి వివిధ కారణాలతో బంగారానికి మద్దతు ఉండే అవకాశాలు కొట్టి పారేయలేమన్నారు.

25 ఏళ్లలో చెత్త ప్రదర్శన
ఇప్పటికే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9000 వరకు తగ్గాయి. మున్ముందు పెళ్లిళ్ళ సీజన్ ఉంది. కాబట్టి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా లేదు. ఈ ప్రభావం ఉండవచ్చు. గత పాతికేళ్లలోనే బంగారానికి 2020 వరస్ట్ ఇయర్‌గా చెబుతున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం 2019లో బంగారం డిమాండ్ 690 టన్నుల కంటే ఎక్కువగా ఉండగా, 2020లో 446 టన్నులకు పడిపోయింది. గత డిసెంబర్ త్రైమాసికానికి అంతకుముందు సంవత్సరం స్థాయికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications