కరోనా వైరస్ తదితర కారణాలతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే, ఈక్విటీ మార్కెట్లు దెబ్బతింటే, చమురు ధరల ప్రభావం వంటి అంశాల ఆధారంగా పెరగడం ఖాయమని చెబుతున్నారు. డాలర్ మారకంతో రూపాయి విలువ ప్రభావం మరింతగా ఉంటుందని, అదే జరిగితే రానున్న రెండేళ్లలో 10 గ్రాముల బంగారం ధర రూ.68,000 చేరుకున్నా ఆశ్చర్యం లేదని మోతీల్వాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తోంది.

అందుకే.. బంగారానికి డిమాండ్ ఇలాగే
ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులు, రేటింగ్ సంస్థ ప్రతికూలత ఔట్ లుక్ వంటి సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లకు బంగారం సురక్షిత పెట్టుబడిగా కనిపిస్తుంది. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములు రూ.48,589 వద్ద సరికొత్త రికార్డులను తాకింది. కరోనా కారణంగా వివిధ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి ఏడాది నుండి ఆ పైన పట్టవచ్చునని, అలాగే కరోనా రెండోసారి విజృంభన భయాలు ఎప్పటికి అప్పుడు రావడంతో బంగారానికి డిమాండ్ రానున్న రోజుల్లోను ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. ఐఎంఎఫ్ కూడా భారత వృద్ధి రేటును ఈ సంవత్సరం మైనస్ 4.9 శాతానికి సవరించింది. అంతర్జాతీయ వృద్ధి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇలాంటి వార్తలు ఇన్వెస్టర్లు బంగారం వైపు చూసేందుకు కారణమవుతాయి కూడా.

బంగారం పెరగడానికి అవకాశాలు ఎక్కువ
కరోనా, భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపిస్తాయి. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ 96.45 వద్ద ఉంది. మూడేళ్ల క్రితం గరిష్టం 102.99తో పోలిస్తే గత మార్చిలో తగ్గింది. బంగారం పెరుగుదలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయని కాబట్టి రానున్న రెండు మూడు నెలల్లో రూ.51,000కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రూ.68,000 బంగారం కానీ...
పరిస్థితులు ఇలాగే కొనసాగితే, డాలర్ మారకంతో రూపాయి ప్రభావాన్ని బట్టి వచ్చే 18 నెలల నుండి 24 నెలల్లో బంగారం ధరలు రూ.65,000 నుండి రూ.68,000 మధ్య పెరగవచ్చునని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కి చెందిన కిషోర్ నార్నె అన్నారు. ఇది ప్రధానంగా డాలర్ మారకంతో కదలికపై ఆధారపడి ఉంటుందని గుర్తు చేస్తున్నారు.

ఏం లేక బంగారం వైపు చూపులు..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు కూడా బంగారాన్ని మించిన ఆప్షన్ లేకుండా పోయిందని చెబుతున్నారు నిపుణులు. బ్యాంకుల్లో రోజు రోజుకు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. చమురు మార్కెట్ అస్థిరంగా ఉంది. ఇది ప్రధానంగా కరోనాపై ఆధారపడి ఉంది. రాబడికి ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోవడం ఇన్వెస్టర్లకు సురక్షిత పెట్టుబడిగా బంగారం కనిపిస్తోందని చెబుతున్నారు.

కరోనా తగ్గినా బంగారం ర్యాలీ
కరోనా తగ్గిన తర్వాత కూడా బంగారం ర్యాలీ చేసే అవకాశాలు లేకపోలేదని, కానీ ఇంత వేగంగా ఉండదని అంటున్నారు. కరోనా ఎప్పుడు తగ్గుతుంది,రెండోసారి విజృంభిస్తుందా అనే అంశాలపై కూడా క్లారిటీ లేదు. కరోనా బారినపడిన ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని, ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు మరో రెండేళ్ల పాటు సులభమైన ద్రవ్య పాలసీ విధానానికే కట్టుబడే అవకాశం ఉందని, ఇది పసిడి బలపడేందుకు సహకరిస్తుందని చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications