ఈ వారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు? రూ.51,000 దిగువ కొనసాగేనా?
బంగారం, వెండి ధరలు ఈ వారం స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతవారం పసిడి ఫ్యూచర్ రూ.50,900 వద్ద, వెండి ఫ్యూచర్ రూ.64వేల సమీపంలో ముగిశాయి. ఈ వారం స్వల్పంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గోల్డ్ డిసెంబర్ ప్యూచర్ ఈ వారం రూ.52,460 స్టాప్ లాస్‌తో రూ.50,210 లక్ష్యంతో షార్ట్ పొజిషన్లు తీసుకోవచ్చునని సూచిస్తున్నారు. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.66,535 పైకి చేరకుంటే మరింత పడిపోవచ్చునని చెబుతున్నారు.

1900 డాలర్ల దిగువనే పసిడి ధరలు
గతవారం ఫైజర్ వ్యాక్సీన్ ప్రకటన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఔన్స్ 1900 డాలర్ల దిగువకు చేరుకున్నాయి. అప్పటి నుండి కొన్ని సందర్భాల్లో 1900 డాలర్లు దాటినప్పటికీ, ప్రధానంగా 1880 డాలర్లకు అటు ఇటుగా కనిపించింది. కరోనా వైరస్ రెండో వేవ్ కనిపించినప్పటికీ, వ్యాక్సీన్ ప్రకటన బంగారంపై ఒత్తిడిని తగ్గించింది.

ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,922గా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.51,045 ఉంది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ కిలో రూ.63,608.00, మార్చి ఫ్యూచర్ రూ.65,396.00గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్ ధరలు పెరిగాయి. ఔన్స్ డిసెంబర్ గోల్డ్ 0.44 శాతం పెరిగి 1,894.50 డాలర్లు పలికింది. క్రితం సెషన్లో 1,886.20 డాలర్లు పలికింది. ఏడాదిలో 26 శాతానికి పైగా పెరిగింది. నేటి సెషన్‌లో 1,885.50-1,897.70 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 1.34 శాతం ఎగిసి 25.108 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.775 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 45 శాతానికి పైగా పెరిగింది.

హైదరాబాద్‌లో ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.51,750 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.47,450 పలికింది. బంగారం ధరపై ద్రవ్యోల్భణం, గ్లోబల్ పసిడి ధరలు, కేంద్ర బ్యాంకుల వద్ద నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications