For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం బంగారం ధరలు పెరుగుతాయా, ఎందుకు? మళ్లీ 2,000 డాలర్ల దిశగా..

|

గతవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇతర కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ క్షీణించడం, ఆర్థిక ప్యాకేజీపై అమెరికాలో తిరిగి చర్చలు ప్రారంభం కావడం వంటి వివిధ కారణాలు పసిడిపై ఒత్తిడిని పెంచాయి. ఈ నేపథ్యంలో ఈవారం పసిడి ధరలపై బులియన్ మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికింది. ఆ తర్వాత రష్యా వ్యాక్సీన్ రావడంతో ధరలు వేగంగా తగ్గాయి. అయితే ట్రంప్‌కు కరోనా సోకిన సమయంలో, క్రితం వారం పసిడి ధరలు పెరిగాయి. రెండు నెలలుగా స్వల్ప హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.

పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్: మైక్రోసాఫ్ట్ బంపరాఫర్, కండిషన్ అప్లై!పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్: మైక్రోసాఫ్ట్ బంపరాఫర్, కండిషన్ అప్లై!

రూ.50,140 కంటే దిగువకు వస్తే

రూ.50,140 కంటే దిగువకు వస్తే

ఈ వారం గోల్డ్ కాంట్రాక్ట్ 10 గ్రాములు రూ.50,140 కంటే దిగువకు వస్తే సానుకూల ధోరణి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఆ స్థాయి కంటే కిందకు వస్తే మాత్రం లాంగ్ పొజిషన్లకు దూరంగా ఉండవచ్చునని సూచిస్తున్నారు. వెండి ఫ్యూచర్స్ కిలో రూ.62,955 స్టాప్ లాస్‌తో లాంగ్ పొజిషన్‌లో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. గతవారం 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 1.28 శాతం పెరిగి రూ.50,817 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.793 వద్ద ముగిసింది. ఫ్యూచర్ మార్కెట్లో బంగారం తిరిగి రూ.51వేలను తాకింది.

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో గతవారం ఔన్స్ పసిడి 1,936 డాలర్లను తాకింది. 1926 వద్ద క్లోజ్ అయ్యాయి. కామెక్స్‌లో 1,898.10 డాలర్ల నుండి 1,936.80 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. నేడు పసిడి మరింత లాభపడింది. 0.32 శాతం ఎగిసి ఔన్స్ ధర 1,932.30 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 1927 డాలర్ల నుండి 1939 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి ధరలు 27 శాతం పెరిగాయి. ఇక సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగా ఎగిసింది. చాలా రోజుల తర్వాత క్రితం సెషన్లో 25 డాలర్లను తాకింది. ఈ రోజు 1.26 శాతం లాభపడి 25.425 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

2000 డాలర్ల దిశగా సాగుతోందా?

2000 డాలర్ల దిశగా సాగుతోందా?

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 2,000 డాలర్ల దిశగా మరోసారి సాగుతోంది. ఇప్పటికే 1939 డాలర్లను తాకింది. ఇటీవల రెండు వారాల గరిష్టం 1930 వద్ద సెటిల్ అయింది. ఈ రోజు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడనుంది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ, డాలర్ వ్యాల్యూ క్షీణత నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి పెరిగింది. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రెండు నెలల క్రితం ఆల్ టైమ్ 2072 మార్కుకు చేరుకున్నాయి. ఆ ధరతో ఇప్పటికీ 140 డాలర్లు తక్కువగా ఉంది.

English summary

ఈ వారం బంగారం ధరలు పెరుగుతాయా, ఎందుకు? మళ్లీ 2,000 డాలర్ల దిశగా.. | Gold Price Analysis: Yellow metal poised for a rally towards the $2000 mark!

Gold poised for a rally towards the $2000 mark in the week ahead. the bullish reversal from the two-month lows of $1849, opening doors for a retest of the $2000 mark in the coming week.
Story first published: Monday, October 12, 2020, 9:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X