For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండొచ్చు, ఎందుకు?

|

ముంబై: అక్టోబర్ 7వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.56,200కంటే పైకి చేరుకొని ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం ధరలు ఆ తర్వాత భారీగా తగ్గాయి. అయితే నెల రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో అస్థిరంగా ఉంటున్నాయి. గరిష్ట ధరతో పోలిస్తే రూ.4,000నుండి రూ.5,500 మధ్య తక్కువగా ఉంటూ వస్తోంది. అయితే గత వారం ధరలు పెరుగుదలనే ఎక్కువగా నమోదు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ వారంలో బంగారం ధరలపై బులియన్ మార్కెట్ నిపుణులు అంచనాలు వెల్లడిస్తున్నారు. ఈ వారం వెండి ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందని, బంగారం దాదాపు స్థిరంగా ఉండవచ్చునని చెబుతున్నారు.

old Price Today: బంగారం ధరలు మరింతగా పెరుగుతాయా?old Price Today: బంగారం ధరలు మరింతగా పెరుగుతాయా?

ఈ వారం బంగారం ధర ఎలా ఉండనుంది?

ఈ వారం బంగారం ధర ఎలా ఉండనుంది?

బంగారం అక్టోబర్ కాంట్రాక్ట్ రూ.50,670స్థాయి దిగువకు వస్తే మరింత పడిపోయేఅవకాశాలు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఈ స్థాయికిపైన ఉంటే మాత్రం దాదాపు స్థిరంగా ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఇటీవల కాంట్రాక్ట్ స్థిరీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో మున్ముందు రాణిస్తుందనుకోవచ్చునని చెబుతున్నారు. అయితే ప్రధానంగా అమెరికా ఎన్నికలు, డాలర్, అమెరికా ఫెడ్ సహా వివిధ దేశాలు ప్రకటించే విధానపరమైన నిర్ణయాలు ఈ వారం పసిడి ఫ్యూచర్స్‌పై ప్రభావం చూపుతాయని అంటున్నారు.

వెండి ధర ఎలా ఉండవచ్చు

వెండి ధర ఎలా ఉండవచ్చు

వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.71,018 ఎగువకు చేరుకోకుంటే ప్రతికూలంగా ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. సమీప భవిష్యత్తులో వెండి ధర పెరిగే అవకాశాలు తక్కువగా ఉందని, కాబట్టి ధరలు పెరిగినప్పుడు అమ్మకాలకు మొగ్గు చూపడం మంచిదని అంటున్నారు.

ఎంసీఎక్స్‌లో పసిడి ధర..

ఎంసీఎక్స్‌లో పసిడి ధర..

ఎంసీఎక్స్‌లో గతవారం పసిడి ధరలు రూ.51,500 దిగువన ప్రారంభమయ్యాయి. వారాంతంలో రూ.51,600 పైకి చేరుకున్నాయి. స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఈ వారం 1950 డాలర్ల పైన ప్రారంభమైంది. కామెక్స్‌లో గతవారం పసిడి 0.5 శాతం మేర పెరిగింది. 1950 నుండి 1975 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. పసిడి వరుసగా రెండు వారాలు లాభపడటం జూలై నుండి ఇది రెండోసారి. నిన్న స్పాట్ గోల్డ్ 1954.20 డాలర్లు పలికింది. వడ్డీ రేట్లు దాదాపు స్థిరంగా ఉండటం వంటి వివిధ అంశాలు పసిడి డిమాండ్‌ను స్థిరంగా ఉంచవచ్చునని చెబుతున్నారు.

English summary

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండొచ్చు, ఎందుకు? | Gold price analysis: Yellow metal gains as tepid dollar

Gold price begins the week in positive territory as analysts eye new U.S. election risk, dollar, and Fed speakers.
Story first published: Monday, September 21, 2020, 9:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X