For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈవారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు... పెరుగుతుందా, తగ్గుతుందా?

|

కరోనా మహమ్మారి కారణంగా ఆగస్ట్ వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, ఆ తర్వాత క్షీణించాయి. రష్యా వ్యాక్సీన్ వచ్చిన తర్వాత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు రూ.6,500కు పైగా తగ్గాయి. గత వారమే రూ.2,000 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హై రూ.59వేల నుండి రూ.53వేల దిగువకు వచ్చింది. అంతకుముందు వారం స్వల్పంగా పెరిగిన ధరలు, గత వారం తగ్గుముఖం పట్టాయి. దీంతో రిటైల్ కొనుగోలుదారులు డైలమాలో ఉన్నారు. ఇంకా తగ్గుతుందా, పెరుగుతుందా అనే ఆందోళన ఉంది.

క్షీణించిన బంగారం ధరలు, 5 డాలర్లకు తగ్గిన డిస్కౌంట్క్షీణించిన బంగారం ధరలు, 5 డాలర్లకు తగ్గిన డిస్కౌంట్

దేశీయంగా రూ.48,000, అంతర్జాతీయంగా రూ.1836 డాలర్లకు..

దేశీయంగా రూ.48,000, అంతర్జాతీయంగా రూ.1836 డాలర్లకు..

ఎంసీఎక్స్‌లో ఈ వారం అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ బలమైన మద్దతు లేకుంటే రూ.49,065కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈస్థాయి వద్ద నిలబడకుంటే మరింతగా పడిపోవచ్చునని భావిస్తున్నారు. రూ.48,250 నుండి రూ.47,785 నుండి కొనుగోళ్లకు మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ తగ్గుదల ఔన్స్ 1,836 డాలర్లకు క్షీణించవచ్చునని అంచనా వేస్తున్నారు. కీలక మద్దతుస్థాయి 1836 డాలర్లకు పడిపోతుందని భావిస్తున్నారు. గత వారం 1966 డాలర్లు గరిష్టం పలికింది. గత వారం పసిడి ధరలు 1860 డాలర్లకు క్షీణించి, శాతానికి పైగా పడిపోయాయి.

గత సెషన్ గరిష్టం 1875 డాలర్లు కాగా, కనిష్టం 1852 డాలర్లు.

గత వారం గరిష్టం 1955 డాలర్లు కాగా, కనిష్టం 1848 డాలర్లు.

గత నె రోజుల్లో గరిష్టం 2075 డాలర్లు.

బంగారం, వెండి ధరలపై ప్రభావం

బంగారం, వెండి ధరలపై ప్రభావం

దేశీయ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ రూ.54 వేల పైన పలికే అవకాశాలు ఉన్నాయి. బంగారం, వెండి ధరలపై అమెరికా ఎన్నికలు, కరోనా మహమ్మారి కేసులు, వ్యాక్సీన్ ప్రకటనలు, ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడం, ఆర్థిక ప్యాకేజీ, డాలర్ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్ వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.

ఈ రోజు బంగారం ధరలు

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200కు పైగా క్షీణించి రూ.52,200 దిగువకు వచ్చింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.250 పతనమై రూ.48,000 దిగువకు వచ్చింది. వెండి గిలో రూ.59వేల దిగువకు వచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పడిపోవడం వంటివి కారణాలు.

English summary

ఈవారం బంగారం ధరలు ఎలా ఉండవచ్చు... పెరుగుతుందా, తగ్గుతుందా? | Gold Price Analysis: Price of Yellow metal fundamental weekly forecast

Gold looks set to extend its recent decline to $1,836 – the 38.2% Fibonacci retracement of March to August rally – as crucial technical indicators have rolled over in favor of the bears.
Story first published: Monday, September 28, 2020, 9:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X