ఢిల్లీ: బంగారం ధరలు ఆగస్ట్ ఆల్ టైమ్ గరిష్టం నుండి ఇప్పటి వరకు దాదాపు 15 శాతం మేర క్షీణించాయి. ఆగస్ట్ 7న గోల్డ్ ఫ్యూచర్స్ పది గ్రాములు రూ.56,200 క్రాస్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుండి కరోనా వ్యాక్సీన్ ప్రకటనలతో తగ్గుతూ వస్తోంది. అడపాదడపా స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ, మళ్లీ క్షీణిస్తోంది. తొలుత మోడర్నా, ఫైజర్, భారత్ బయోటెక్ వంటి వివిధ సంస్థల వ్యాక్సీన్ సానుకూల ప్రకటనలు, ఇప్పుడు ఏకంగా వ్యాక్సినేషన్ ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై ఒత్తిడి తగ్గింది. దీంతో ధరలు క్షీణిస్తున్నాయి.

బంగారం, వెండి ధరలు
ఆగస్ట్ నెలలో రూ.56,700ను క్రాస్ చేసిన పది గ్రాముల బంగారం ధర నాటి నుండి ఇప్పటి వరకు 15 శాతం పడిపోయింది. ప్రస్తుతం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,000కు పైన ఉంది. చివరి సెషన్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.85.00 (-0.17%) క్షీణించి రూ.50064.00 వద్ద ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,198గా ఉంది. వెండి ధరల విషయానికి వస్తే సిల్వర్ ఫ్యూచర్ మార్చి కిలో రూ.67518.00, మే ఫ్యూచర్ రూ.68160.00 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,882.90 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 25.942 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

10 శాతం వరకు పెట్టుబడి
స్వల్పకాలంలో బంగారం ధరల హెచ్చుతగ్గుల గురించి ఆలోచించవద్దని, ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి ధరలు కొనుగోలుకు అనుకూలంగా ఉన్నాయని, పోర్ట్‌పోలియోలో 5 శాతం నుండి 10 శాతం మేర పెట్టుబడులు పెట్టాలని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారాన్ని, ఈక్విటీలను జత చేయవద్దని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల టైమ్ జోన్‌తో గోల్డ్ పైన పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.

వడ్డీ రేటు ప్రభావం
2020 ప్రారంభం నుండి ఇప్పటి వరకు బంగారం కొనుగోలుదారులకు 25 శాతం రిటర్న్స్ అందించింది. అయితే 2021లో ప్రస్తుత ఏడాది మేరకు పెరగకపోవచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాది కరోనా, అమెరికా ఎన్నికలు, ఇతర అనిశ్చితుల ప్రభావం పడింది. దీంతో భారీగా ఎగిసింది. కరోనా తగ్గుముఖం పట్టింది. అమెరికా ఎన్నికల అనిశ్చితి తేలిపోయింది. ఆ సమయంలో పసిడి ధరలు ఏకంగా రూ.48,000 దిగువకు వచ్చాయి. వడ్డీ రేట్లు చాలా తక్కువగా లేదా సున్నాగా ఉండటంతో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపవచ్చు. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను 2023 వరకు జీరో స్థాయిలోనే ఉంచనుందని, ఈ నేపథ్యంలో డాలర్ క్షీణత, బంగారానికి అసెట్ అని అంటున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..



Click it and Unblock the Notifications