ఆగస్ట్‌లో రష్యా వ్యాక్సీన్ వచ్చే వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. గత నెల 7వ తేదీన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధర రూ.56,200 పైన చేరుకొని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత పసిడి ధరలు పైకి లేస్తూ, కిందకు పడుతూ గరిష్ట ధర నుండి రూ.4,500కు పైగా తక్కువగా ఉంది. బంగారు వ్యాపారస్తులు పసిడిపై వరుసగా ఐదో వారం ఆఫర్లు ఇస్తున్నారు. ప్రపంచంలో పసిడిని ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగారం ధరలు గత కొంతకాలం క్రితంతో పోలిస్తే తగ్గడంతో ఈవారంకూడా వ్యాపారస్తులు డిస్కౌంట్ ఇస్తున్నారు.

డిస్కౌంట్... ధర స్థిరంగా ఉంటేనే..
ఇప్పుడు పండుగ సీజన్ వచ్చింది. ఇప్పటి వరకు భౌతిక బంగారం కొనుగోళ్లు లేక రిటైల్ వ్యాపారులు దెబ్బతిన్నారు. ఇప్పుడు రిటైలర్ల ఆశలు పండుగపై ఉన్నాయి. దేశంలో ఔన్స్ ధరపై 23 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. గత వారం ఔన్స్ పైన 30 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇచ్చారు. అధికారిక దేశీయ ధరలపై 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీతో కలిపి డిస్కౌంట్ ఈ వారం 23 డాలర్లకు తగ్గింది. పండుగ సీజన్ సమీపిస్తోందని, పసిడి ధరలు స్థిరంగా ఉంటేనే రాబోయే వారాల్లో డిమాండ్ పెరుగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. పుత్తడి ధరలు భారీగా పెరిగినా లేదా తగ్గినా భౌతిక బంగారానికి డిమాండ్ పడిపోవచ్చు. దాదాపు స్థిరంగా ఉంటేనే కొనుగోళ్లు పెరుగుతాయని అంటున్నారు.

ఈ వారం పెరిగిన ధర
శుక్రవారం డొమెస్టిక్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.51,500కు పైన పలికింది. ఈ వారం పసిడి ధరలు 0.5 శాతం మేర లాభపడ్డాయి. ఆస్ట్రాజెనికా ప్రయోగాలు తొలుత నిలిపివేసినట్లుగా వార్తలు రావడంతో ఈ ప్రభావం పడింది. జ్యువెల్లర్స్ స్థిరమైన ధరల ధోరణి కోసం వేచి చూస్తున్నారని, ఎందుకంటే వచ్చే నెల నుండి పండుగ సీజన్ బిజినెస్ వేగవంతమవుతుందని అంటున్నారు. చైనాలో డిస్కౌంట్ 44 డాలర్ల నుండి 48 డాలర్లు ఉంది.

ఈ సంవత్సరం చివరి వరకు ఇంతే..
ఈ సంవత్సరం చివరి నాటికి కూడా ఫిజికల్ గోల్డ్ మార్కెట్ కరోనా పూర్వస్థితికి చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. పండుగ సీజన్ అయినప్పటికీ కాస్త పుంజుకుంటాయేమోనని, కానీ ఇదివరకు ఉన్న పరిస్థితులు అప్పుడే ఉండకపోవచ్చునని అంటున్నారు. కరోనా మహమ్మారి డిమాండ్‌ను దెబ్బతీసింది. దీంతో చైనాలో ఫిబ్రవరి నుండి డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications