బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వారం చివరి సెషన్లో స్వల్పంగా పెరిగినప్పటికీ, మొత్తంగా క్షీణించాయి. అంతర్జాతీయంగా బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీకి డిమాండ్ పెరగడం, అమెరికా బాండ్స్ పైన అధిక ప్రతిఫలాలు వస్తుండటం, స్టాక్ మార్కెట్ రాణించడం వల్ల పసిడి, వెండి ధరలపై ప్రభావం పడింది. బిట్ కాయిన్, స్టాక్ మార్కెట్‌కు పెట్టుబడులు తరలుతున్నాయి. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అందుకే పసిడి ధరలు పది నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ వారం పసిడి ఫ్యూచర్ మార్కెట్లో రూ.46,000 దిగువన ముగిసింది.

తగ్గి.. మళ్లీ పెరగొచ్చు
దేశీయంగా బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 దిగువకు, వెండి కిలో రూ.68,000 దిగువకు చేరుకుంది. మున్ముందు పసిడి రూ.44,000 దిగువకు, వెండి రూ.65,000 స్థాయికి చేరవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాదిస్థాయికి కాకపోయినా ఈ ఏడాదిలో తిరిగి ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. కరోనాకు ముందు బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుండి 40 శాతం వరకు లాభాలు వచ్చాయి. దీంతో కొద్ది రోజులుగా బంగారంపై పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇటీవల భారీగా పడిపోవడంతో తిరిగి పెట్టుబడులు తగ్గాయి.

రిటైల్ మార్కెట్లో ఇలా
ఈ ఏడాదిలో పసిడి ఇప్పటికే 5 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం 1,700 డాలర్ల వద్ద ఉంది. దేశీయంగా రూ.46,000 సమీపంలో ఉంది. కమొడిటీ ట్రేడింగ్ జరిగే ఎంసీఎక్స్‌లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.44,445 వద్ద ఉంది. రిటైల్ మార్కెట్లో ఈ ధరకు 3 శాతం జీఎస్టీ, 0.0075 శాతం టీసీఎస్ కలిపితే అది మేలిమి బంగారం అవుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.99 పెరిగి రూ.44,640 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.77 పెరిగి రూ.44,813 వద్ద క్లోజ్ అయింది. వెండి రూ.204 తగ్గి రూ.65,717 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.66,800 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ గోల్డ్ ఫ్యూచర్స్ 2.70 (-0.16%) తగ్గి రూ.1698 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.181
(-0.71%) తగ్గి రూ.25,280 వద్ద క్లోజ్ అింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications