చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో చాలామంది ఇతరుల నుండి రుణం తీసుకుంటారు. శాలరైడ్ అయితే తమ చేతిలో డబ్బులు లేకుండా పెద్ద మొత్తంలో అవసరమైనప్పుడు వారికి మొదటగా గుర్తుకు వచ్చేది పర్సనల్ లోన్. అవసరాల కోసం పర్సనల్ లోన్ చాలా సాధారణం. అలాగే వెహికిల్ లోన్, హోమ్ లోన్ కోసం చాలామంది వెళ్తుంటారు. అయితే ఈ లోన్లు తీసుకునే సమయంలో ఎలిజిబిలిటీ, క్రెడిట్ స్కోర్, మీ బ్యాలెన్స్ షీట్, శాలరీ వంటివి చూస్తారు. వాటి ఆధారంగా లోన్ ఇస్తారు.

అతి తక్కువ సమయంలో లోన్..
పర్సనల్ లోన్ అన్‌సెక్యూర్డ్, తక్కువ డాక్యుమెంటేషన్ కలిగిన సౌకర్యం. ఇది కొద్ది రోజులు.. ఇప్పుడైతే నిమిషాల్లోనే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. మీ నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా గంటల్లో రుణం పొందవచ్చు. కానీ వడ్డీ రేటు, రుణం మొత్తం, క్రెడిట్ స్కోర్, లోన్ రీపేమెంట్ హిస్టరీ వంటి వాటిని చూస్తారు. వాటి ఆధారంగానే లోన్ ఇస్తారు.

క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణ సౌకర్యం ఈజీ
ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ 300 నుండి 900 మధ్య మారుతూ ఉంటుంది. బ్యాంకులు క్రెడిట్ స్కోర్‌ను 700, అంతకంటే ఎక్కువ ఉంటే రుణానికి సులువైన అర్హులుగా భావిస్తారు. మీ వ్యక్తిగత రుణ అర్హతను పెంచేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..

ఈఎంఐ చెల్లింపుల్లో డిఫాల్ట్ వద్దు
బ్యాంకుల నుండి ఏ తరహా లోన్ తీసుకున్నప్పటికీ EMI చెల్లింపులో జాప్యం చేయవద్దు. ఎందుకంటే ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సకాలంలో ఈఎంఐ చెల్లిస్తే మీరు క్రమశిక్షణతో అప్పు చెల్లిస్తున్న వారిగా పరిగణిస్తారు. అంటే మీకు రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందని భావిస్తారు. ఈఎంఐలు చెల్లించడంలో జాప్యం చేస్తే బ్యాంకులు వ్యక్తిగత రుణాన్ని ఇవ్వడానికి వెనుకాడుతాయి. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.

నిర్ణీత గడువులోగా క్రెడిట్ కార్డు బిల్స్ కట్టాలి
క్రెడిట్ కార్డు బిల్లులను నిర్ణీత గడువులోగా చెల్లించడం మంచిది. ఇది కూడా మీ క్రెడిట్ స్కోర్‌కు సహాయపడుతుంది. వ్యక్తిగత రుణం కోసం కూడా మీ అర్హతను పెంచుతుంది.

క్రెడిట్ కార్డును తరుచూ ఉపయోగించవద్దు
బ్యాంకులు మీకు పర్సనల్ లోన్ ఇచ్చే సమయంలో మీ క్రెడిట్ కార్డు హిస్టరీని చూస్తాయి. క్రెడిట్ కార్డు వినియోగ నిష్పత్తిని కూడా పరిశీలిస్తాయి. మీ క్రెడిట్ కార్డుల మొత్తం.. మీరు ఉపయోగించిన మొత్తాన్ని కూడా చూస్తారు. క్రెడియ్ వినియోగ నిష్పత్తి తక్కువగా ఉంటే బ్యాంకులు పర్సనల్ లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి.

తరుచూ దరఖాస్తు చేసుకోవద్దు..
పర్సనల్ లోన్ కోసం తరుచూ దరఖాస్తు చేసుకోవద్దు. ఇది మీ క్రెడిట్ స్కోర్ పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది వ్యక్తిగత రుణ అర్హతను తగ్గిస్తుంది. నిర్లక్ష్యపూరిత ఖర్చు లేదా రుణాలను నియంత్రించించలేని రుణదాతగా పరిగణిస్తారు.

ఉత్తమమైన దానిని ఎంచుకోండి
మీరు వివిధ బ్యాంకుల్లో లోన్ కోసం విచారణ జరిపితే మీకు రుణం అత్యవసరమని బ్యాంకులు భావించే పరిస్థితులు ఉంటాయి. మీ దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు దరఖాస్తు చేసుకోవడానికి ముందే అన్ని బ్యాంకుల వడ్డీ రేట్లను చూసుకున్న తర్వాత మీకు ఏది యాప్ట్ అయితే దానికి వెళ్లడం మంచిది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications