రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఈ స్టాక్స్‌లో ఆ పెట్టుబడులు జంప్

ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వివిధ స్టాక్స్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. జూన్ 21వ తేదీనాటికి 33 బీఎస్ఈ లిస్టెండ్ స్టాక్స్‌లో అతనికి 1 శాతం వరకు వాటా ఉన్నట్లు డేటా వెల్లడిస్తోంది. రాకేష్ ఇన్వెస్ట్ చేసిన ఈ 33 కంపెనీల్లోని ఆరు స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్, FIIలు తమ వాటాను జూన్ క్వార్టర్‌లో భారీగా పెంచాయి.

సాధారణంగా చిన్న చిన్న ఇన్వెస్టర్లు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వేటిల్లో పెట్టుబడి పెట్టారు, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో చూసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే పెద్ద ఇన్వెస్టర్ల పెట్టుబడి లక్ష్యాలు, వ్యూహాలు, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి లక్ష్యాలు, వ్యూహాలు, ఫారెన్ ఇన్వెస్టర్ల పెట్టుబడి లక్ష్యాలు, వ్యూహాలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ఈ మూడింటిని ఓ స్టాక్ కలిగి ఉంటే అది ప్రత్యేకంగా కనిపిస్తుంది.

77 శాతం వరకు లాభం

77 శాతం వరకు లాభం

జూన్ త్రైమాసికంలో పలు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు(FIIs), మ్యూచువల్ ఫండ్స్(MFs) తమ స్టాక్స్‌ను పెంచిన, రాకేష్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్‌ను ఇక్కడ చూద్దాం... జూన్ 21 తేదీ నాటికి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 33 బీఎస్ఈ స్టాక్స్‌లో 1 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ 33 స్టాక్స్‌లో ఆరింటిలో MFs, FIIs తమ వాటాను పెంచాయి. ఈ ఆరు స్టాక్స్ 2021 క్యాలెండర్ ఏడాదిలో 23 శాతం నుండి 77 శాతం లాభపడ్డాయి.

టాటా మోటార్స్‌లో వాటా

టాటా మోటార్స్‌లో వాటా

ఆటో దిగ్గజం టాటా మోటార్స్ 2021లో ఏకంగా 77 శాతం రిటర్న్స్ ఇచ్చింది. జూలై 28వ తేదీ నాటికి ఈ స్టాక్ రూ.287 వద్ద ముగిసింది. ఈ స్టాక్‌లో FII హోల్డింగ్స్ మార్చి 2021 త్రైమాసికంలో 23.55 శాతం నుండి జూన్ త్రైమాసికానికి 24.07 శాతానికి పెరిగాయి. MFs 22.29 శాతం నుండి 23.70 శాతానికి పెరిగాయి. జూన్ త్రైమాసికానికి ఈ స్టాక్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వాటా 1.97 శాతంగా ఉంది.

ఈ స్టాక్స్‌లో జంప్

ఈ స్టాక్స్‌లో జంప్

వీఏ టెక్ వాబాగ్ లిమిటెడ్ స్టాక్‌లో FIIs వాటా మార్చి త్రైమాసికంలో 14.61 శాతం నుండి జూన్ త్రైమాసికానికి 15.91 శాతం పెరిగింది. MFs వాటా 2.54 శాతం నుండి 3.07 శాతానికి పెరిగింది. ఇందులో రాకేష్ వాటా 8.04 శాతంగా ఉంది.

క్రిసిల్ లిమిటెడ్ స్టాక్ 57 శాతం వరకు పెరిగింది. FIIs స్టాక్ హోల్డింగ్స్ 6.71 శాతం నుండి 6.81 శాతానికి పెరిగియి. MFs హోల్డింగ్స్ 1.97 శాతం నుండి 2.16 శాతానికి పెరిగాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వాటా 2.57 శాతంగా ఉంది.

ఇండియా బుల్స్, టీవీ 18

ఇండియా బుల్స్, టీవీ 18

ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్ ఈ ఏడాది 30 శాతం వరకు ఎగిసింది. FIIs స్టాక్ హోల్డింగ్స్ 33.61 శాతం నుండి 33.63 శాతానికి పెరిగియి. MFs హోల్డింగ్స్ 2.81 శాతం నుండి 2.95 శాతానికి పెరిగాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వాటా 2.17 శాతంగా ఉంది.

టీవీ 18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్ స్టాక్ ఈ ఏడాది 23 శాతం వరకు ఎగిసింది. FIIs స్టాక్ హోల్డింగ్స్ 12.11 శాతం నుండి 12.25 శాతానికి పెరిగియి. MFs హోల్డింగ్స్ 0.02 శాతం నుండి 0.82 శాతానికి పెరిగాయి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వాటా 2.04 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+