రోజువారీ ఆఫీస్ కష్టాల నుంచి ఎర్లీ ఏజ్ లోనే బయటపడాలంటే.. త్వరగా సంపాదించి ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వాలి. అయితే జీతంపై మాత్రమే ఆధారపడే మధ్యతరగతి ఉద్యోగులకు ఈ లక్ష్యం చాలా కష్టమైనదిగా కనిపిస్తుంది. కానీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ, తెలివైన పెట్టుబడులు ఉంటే ఎర్లీ రిటైర్మెంట్ (Early Retirement) అనేది అసాధ్యం కాదు.
మీకు ఎంత కార్పస్ (Corpus) అవసరం?
50 ఏళ్లకు పదవీ విరమణ చేయడం అంటే.. మీ డబ్బు రాబోయే 30-35 సంవత్సరాలకు సరిపోవాలి. అందుకే సరైన కార్పస్‌ను అంచనా వేయడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం.. ఈ కార్పస్‌ను అంచనా వేయడానికి ఒక ఫార్ములా ఉంది. అదే.. వార్షిక ఖర్చుx 30 లేదా 35.
ఉదాహరణకు మీ ప్రస్తుత వార్షిక ఖర్చు రూ. 12 లక్షలు అనుకుంటే.. మీ రిటైర్మెంట్ కార్పస్ రూ. 3.6 కోట్లు ఉండాలి.

ద్రవ్యోల్బణం లెక్క ఇలా..
ద్రవ్యోల్బణం(Inflation) అనేది పెట్టుబడులకు అతిపెద్ద అవరోధంగా ఉంటుంది. ఇది కాలంతో పాటు డబ్బు విలువను తగ్గిస్తుంది. ఉదాహరణకు.. నేడు రూ. 100తో కొనే వస్తువును ఐదేళ్ల తర్వాత అదే రూ. 100తో కొనుగోలు చేయలేం. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏటా 6% ద్రవ్యోల్బణం ప్రకారం.. ఈ రోజు నెలకు రూ. 1 లక్ష ఖర్చు ఐదేళ్లలో నెలకు రూ. 1.34 లక్షలకు పెరుగుతుంది. దీంతో వార్షిక ఖర్చు రూ. 16.1 లక్షలకు చేరుతుంది. కాబట్టి మీరు రిటైర్ అయ్యే సమయానికి (50 ఏళ్లకు) అవసరమైన కార్పస్ రూ. 4 కోట్లు నుంచి రూ. 4.8 కోట్ల వరకు పెరుగుతుంది. Early Retirement ప్లాన్ చేసేటప్పుడు ఈ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి.
క్రమశిక్షణ.. కాంపౌండింగ్..
Early Retirement కార్పస్‌ను నిర్మించడానికి ఆర్థిక క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం చాలా అవసరం. కాంపౌండింగ్ అనేది మీ డబ్బును మరింత పెంచడానికి సహాయపడుతుంది. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. కాంపౌండింగ్ ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ పెట్టుబడులు ఒకే రంగంలో కాకుండా, ఈక్విటీలు (Equities), డెట్ (Debt), బంగారం (Gold), వంటి వాటిలో విభజించడం వలన రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ బెనిఫిట్ పొందాలంటే.. ఈక్విటీ ఫండ్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే రిస్క్ ను బ్యాలెన్స్ చేయడం కోసం డెట్ ఫండ్స్ లో కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇక చివరగా సిస్టమాటిక్ విత్ డ్రాల్ ప్లాన్(Systematic Withdrawals - SWP) సెటప్ చేయడం ద్వారా మీ డబ్బు దీర్ఘకాలం పాటు ఒక క్రమపద్ధతిలో విత్ డ్రా చేసుకోడానికి వీలవుతుంది.
నిపుణుల సలహా ముఖ్యం
సాధారణంగా రిటైర్మెంట్ అంటే 60 నుంచి 65 ఏళ్లు ఉంటుంది. అయితే మీరు ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్నట్టయితే 40 నుంచి 50 ఏళ్ల లోపే ఉద్యోగానికి స్వస్తి చెప్పాలి. దీనికోసం అవసరమైన ఫండ్ కోసం సరైన నిపుణుడ్ని సంప్రదించి సలహా తీసుకోవడం ముఖ్యం. మీ అవసరాలు, ఆదాయాన్ని బట్టి వాళ్లు సరైన అంచనా వేస్తారు. అలాగే ఫండ్ ఎంపిక విషయంలో కూడా తగినంత జాగ్రత్త తీసుకోవడం ముఖ్యం.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications